‘బాబు’కు మతి భ్రమించింది

17 Aug, 2019 09:20 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి

సాక్షి, అనంతపురం : చంద్రబాబుకు మతి భ్రమించిందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరాతో కలిసి శుక్రవారం ఆయన విలేకరుతో మాట్లాడారు. పాలిచ్చే ఆవును కాదని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని ప్రజలను హేళనగా మాట్లాడడం చంద్రబాబుకు తగదని మండిపడ్డారు.  చంద్రబాబు దోపిడీ పాలనను చూసిన ప్రజలు ఆయనను ఘోరంగా ఓడించారనే వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారన్నారు.

వైఎస్సార్‌ మరణానంతరం కాంగ్రెస్‌తో కలిసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. చంద్రబాబు చేసిన కుట్రలు, కుతంత్రాలకు సమర్థవంతంగా ఎదుర్కొని  151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలను ఒంటి చెత్తో గెలిపించుకున్నారన్నారు. వైఎస్‌ జగన్‌  50 రోజుల్లోనే  హామీలను నేరవేర్చేలా అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి వాటి అమలుకు చర్యలు తీసుకున్నారన్నారు. భారతదేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో జగన్‌కు మూడో స్థానం దక్కిందనే విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు గుర్తించాలని హితవుపలికారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు