జీఎస్‌టీ, నోట్ల రద్దుతో సర్జికల్ స్ట్రైక్స్ : జిగ్నేష్‌

3 Jul, 2018 11:59 IST|Sakshi
జిగ్నేష్‌ మేవాని (ఫైల్‌ ఫోటో)

గాంధీనగర్‌ : ప్రధాని నరేంద్ర మోదీపై దళిత ఉద్యమ నేత గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని విమర్శల వర్షం కురిపించారు. 125 కోట్ల దేశ ప్రజలపై ప్రాణాంతకమైన సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. 2016 నవంబర్‌లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత జవాన్లు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియోలను పలు ఛానల్స్‌ ఇటీవల ప్రసారం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మేవాని మంగళవారం గుజరాత్‌లోని తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం వాద్గామ్‌లో మీడియాతో మాట్లాడారు.

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారని విమర్శించారు. అధికారంలోకి రాగానే రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన మోదీ ఒక్కరికి కూడా ఉద్యోగాన్ని ఇవ్వకుండా దేశ యువతపై సర్జికల్‌ దాడులు చేశారని వ్యాఖ్యానించారు. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండితలు చేస్తామన్న మోదీ ఆ హామీ గాలికొదిలేశారని మండిపడ్డారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన మేవాని.. వాద్గామ్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు