‘చంద్రబాబుకు రానున్న రోజులు గడ్డుకాలమే’

18 May, 2019 19:32 IST|Sakshi

చంద్రబాబు ఓటమి తర్వాత అవినీతి చిట్టా బయటకి

మిషన్ 2024 తో ఏపీ, తెలంగాణ, కేరళలో పెద్ద శక్తిగా ఎదుగుతాం

కాంగ్రెస్‌కు 50-60 సీట్లు మాత్రమే: జీవీఎల్‌

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి సింగల్ డిజిట్ సీట్ల మాత్రమే వస్తాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు జోస్యం చెప్పారు. మే 23 తర్వాత రాజకీయాల్లో చంద్రబాబు ప్రాతినిధ్యాన్ని కోల్పోతారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ప్రతిపక్ష హోదా వస్తుందో లేదో కూడా అనుమానమేనని అన్నారు.  ఆ పార్టీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు ఉన్నాయని జీవీఎల్‌ విశ్లేషించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తర్వాత అవినీతి చిట్టా బయటకి రాబోతుందని హెచ్చరించారు. చంద్రబాబుకు రానున్న రోజులు గడ్డుకాలంగా పరిణమిస్తాయని పేర్కొన్నారు.

శనివారం జీవీఎల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ. ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రానుంది. ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు పూర్తి అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా నరేంద్ర మోదీకి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం కూడా పెరగనుంది. అభివృద్ధి ఆధారంగానే మోదీ మూడుసార్లు సీఎం అయ్యారు. మరోసారి ప్రధానిగా ఎన్నిక కాబోతున్నారు. బీజేపీ సీట్ల సంఖ్య మరింత పతాక స్థాయికి చేరబోతోంది.  మిషన్ 2024 తో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, కేరళలో పెద్ద శక్తిగా ఎదుగుతాం. టీడీపీ ఓటమితో మాపార్టీ మిషన్ ప్రారంభం అవుతుంది. బీజేపీ అభివృద్ధికి టీడీపీ ఓటమితో నాంది పలుకుతాం. ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండంగా మారాయి. కాంగ్రెస్‌కు 50-60 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. సోనియా లేఖకు స్పందించి పార్టీలేవీ పొరపాటు చేయవని అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
చంద్రబాబు ఓటమి తర్వాత అవినీతి చిట్టా బయటకి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌