పవన్‌ కల్యాణ్‌కు మోపిదేవి సవాల్‌

7 Dec, 2019 16:09 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు చేతనైతే రైతు సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని ఆంధ్రప్రదేశ్‌ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సవాల్‌ విసిరారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవడం తప్ప పవన్‌కు ఇంకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. రైతాంగ సమస్యలు తెలియకుండానే పవన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు.

‘ఉల్లి సమస్య దేశమంతటా ఉంది. రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లి రూ.25కే అందిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు. వారి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ప్రవేశపెట్టారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి’ అని మోపిదేవి హితవు పలికారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు