చంద్రబాబు ఓటమిపై మోత్కుపల్లి హర్షం

23 May, 2019 17:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై ఆ పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మోత్కుపల్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘దుర్మార్గుడి పీడ వదిలినందుకు రేపు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తా’ అని అన్నారు.

మరిన్ని వార్తలు