బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి

4 Nov, 2019 13:21 IST|Sakshi

న్యూఢిల్లీ : మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసిన మోత్కుపల్లి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మోత్కుపల్లితో పాటు అమిత్‌ షాను కలిసిన వారిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఆ పార్టీ నాయకులు వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, వీరెందర్‌ గౌడ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పరిస్థితులను లక్ష్మణ్‌ అమిత్‌ షాకు వివరించారు. కాగా, మరికాసేపట్లో మోత్కుపల్లి బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాను కలవనున్నారు. 

గతంలో టీడీపీలో కొనసాగిన మోత్కుపల్లి.. ఆ పార్టీని వీడిన తరువాత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో సామాజిక న్యాయం లేదని  కోట్ల రూపాయలకు ఎంపీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని, టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఒకానొక సమయంలో సంచలన ప్రకటన చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారం  జోరుగా సాగింది. అయితే ఆయన ఆ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో బీఎల్‌ఎఫ్‌ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కొంత కాలంగా మౌనంగా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిలు ఆయన ఇంటికి వెళ్లి.. బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆయన నేడు బీజేపీలో చేరారు. పార్టీలో మంచి గౌరవం దుక్కతుందనే హామీ మేరకే ఆయన బీజేపీలో చేరినట్టుగా సమాచారం. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు