కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారు: కవిత

2 Mar, 2018 13:50 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత

మోదీని అవమానించాలనే సంకుచిత ఉద్దేశం లేదు

సీఎం కేసీఆర్ మాటల ఫ్లోలో అలా వచ్చింది: ఎంపీ కవిత

సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని అవమానించాలనే సంకుచిత ఉద్దేశం టీఆర్‌ఎస్‌ నేతలకు లేదని ఆ పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తన ప్రసంగంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కావాలని మోదీని అలా అనలేదని.. మాటల ఫ్లోలో అలా వచ్చిందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఇక్కడి మీడియాలో ఎంపీ కవిత మాట్లాడారు. చిన్న పొరపాటును బీజేపీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. రైతుల పట్ల ఆవేదనతోనే సీఎం కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారని తెలిపారు.

విభజన చట్టంలోని ప్రతి హామీని అమలు చేయాలన్నారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు టీఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో 2014 నుంచే తాము మద్ధతిస్తున్నట్లు ఎంపీ కవిత గుర్తుచేశారు. ‘నాన్నగారు (కేసీఆర్) అలా మాట్లాడతారని అనుకోను. ‘స్లిప్‌ ఆఫ్‌ ద టంగ్‌ (పొరపాటున) అయి ఉంటుందంటూ’ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఇదివరకే ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు