జాతీయ పార్టీలపై నమ్మకం లేదనే..

18 May, 2018 10:37 IST|Sakshi
నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత

సాక్షి, నిజామాబాద్‌ : కర్టాటక ప్రజలు ఇచ్చిన తీర్పు మాత్రం జాతీయ పార్టీలపై విశ్వాసం లేదనే అర్థం అవుతుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కర్టాటకలో ఏ పార్టీకి ఓటు వేయాలో అర్ధం కాని కన్ఫ్యూజన్‌ ప్రజల్లో ఏర్పడిందన్నారు. జాతీయ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్‌ కూడా ఇదే చెబుతున్నారు. సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బీజేపీ ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి..వారం అయితే తప్ప ఏం జరుగుతుందో చెప్పలేమని మంత్రి తెలిపారు.

‘కాంగ్రెస్‌ నుంచి వచ్చిన డీఎస్‌ శ్రీనివాసులుకి టీఆర్‌ఎస్‌ సముచిత గౌరవం ఇచ్చింది. ఆయనకు టీఆర్‌ఎస్‌లో చాలా ఫ్రీడం ఉంది.. ఏవిధమైన ఇబ్బంది లేదు. కానీ డీఎస్‌ ఆనుచరులు అసంతృప్తి ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే సమన్వయం  చేసుకుంటాం. అంతేకాక జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. రైతులకు రైతుబంధు పతకంలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్‌ నగదు ఏర్పాటు చేయించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. 

అంతేకాక క్రీడాకారులకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నాం. ఎక్కడా లేని విధంగా సీఎం రైతులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్‌ను ప్రకటించారు. ఎర్రజొన్న రైతులకు మంచి ధర కల్పించి కొనుగోలు చేశాం. నీటి పారుదల, రైతు, వ్యవసాయం ఈ మూడు అంశాలకు టీఆర్‌ఎస్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చింది’. అని ఎంపీ కవిత తెలిపారు.
 

మరిన్ని వార్తలు