‘బరితెగించి ఇంకా కేసీఆర్‌ అప్పులు చేస్తానంటున్నాడు’

23 Sep, 2019 18:07 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి : ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల ఊబిలోకి నెట్టారని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎలిగేడు మండలం శివపల్లిలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ​​మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పుట్టబోయే బిడ్డపై లక్ష రూపాయల భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని, ప్రభుత్వ దుబారా వ్యయాన్నికాగ్‌ నివేదిక తప్పుబట్టిందని తెలిపారు. కేసీఆర్‌ ఇంకా బరితెగించి అప్పులు చేస్తానంటునాడని మండిపడ్డారు. హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమ్‌గా స్వీకరించాలన్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కొట్టిపారేశారు. ఇలాంటి  అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు స్పందించాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు