దోచుకున్న సొమ్ముతో ఎన్నికలకు: వరప్రసాద్‌

21 Jun, 2018 02:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇచ్చిన హామీలు నెరవేర్చ మని అడుగుతున్న బడుగు, బలహీన వర్గాలపై చంద్రబాబు దూషణ లకు దిగుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధిచెబు తారని హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌ అన్నారు. బుధవారం వరప్రసాద్‌ హైదరాబాద్‌ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లు అధికారంతో దోచుకున్న సొమ్ముతో ఎన్నికలకు సిద్ధమవుతున్న బాబు బీసీలు, ఎస్సీ, ఇతర వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వారే ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఎన్నికల హామీని నెరవేర్చాలని కోరిన మత్స్యకారులను మీ అంతు చూస్తానని చంద్రబాబు బెదిరించారని, తాజాగా కనీస వేతనాలు అడిగిన నాయీబ్రాహ్మణులను బెదిరించారని, దీన్ని బట్టి ఆయనకు ఎంత అహంకారమో స్పష్టమవుతోందన్నారు. 

సాగునీటి ప్రాజెక్టులను తనఖా పెడతారా?
రాష్ట్రంలోని పది సాగునీటి ప్రాజెక్టులను బ్యాంకులకు తనఖా పెట్టడానికి వీలుగా ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రైతువిభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగాన్ని ఏం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆయన ప్రశ్నించారు.   

మరిన్ని వార్తలు