టీఎంసీల కొద్దీ కన్నీరు కారుస్తున్నావు!

3 Aug, 2019 11:45 IST|Sakshi

యనుమలపై ఎంపీ విజయసాయిరెడ్డి విసుర్లు

సాక్షి, అమరావతి : పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమని చెబితే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులన్నింటినీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి వేల కోట్ల రూపాయల కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపడి.. అడ్డంగా దొరికిన తర్వాత వారికి పులివెందులా పంచాయతీలా అనిపిస్తోందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ఇక అన్న క్యాంటీన్ల విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్‌ స్పందిస్తున్న తీరును విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘అన్న క్యాంటీన్లను మీ హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా నడిపారా లోకేశ్ బాబూ? మూసేశారని టీఎంసీల కొద్ది కన్నీరు కారుస్తున్నావు. మీ పథకాలన్నీ ప్రజల సంక్షేమానికి కాకుండా దోచుకునేందుకే మొదలు పెట్టారు. క్యాంటీన్ నిధులను పసుపు-కుంకుమ ప్రలోభాలకు మళ్లించి 43 కోట్ల బకాయి పెట్టారు’ అని గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

ములాఖత్‌లో కలుద్దురు...!
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కుట్రలో చంద్రబాబుకు సహకరించిన యనుమల.. ఇప్పుడు గురివిందలా విలువల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అర్ధరాత్రి ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం కాళ్లు పట్టుకుని వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టించింది మీ బాసే కదా అంటూ యనుమలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేపు మీ నాయకుడు, ఆయన కొడుకు ఏ జైల్లో ఉంటారో? ములాఖత్‌లో కలుద్దురు. సిద్ధంగా ఉండండి’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేశ్‌లను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంతకీ జనసేనలో ఏం జరుగుతోంది!

విశాఖ తీరం: మునిగిపోతున్న నావలా టీడీపీ

ఆ విషయం కన్నాకు చివరివరకు తెలియదు!

గుత్తా పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌

అమెరికా రోడ్లపై సరదాగా చంద్రబాబు!

ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..

బీజేపీ ఎంపీల శిక్షణా తరగతులు ప్రారంభం

ఆ మాటలు వినకుండా.. గమ్మున ఉండండి

నిలకడలేని నిర్ణయాలతో...వివేక్‌ దారెటు..?

డబ్బులిస్తేనే టికెట్‌ ఇచ్చారు: ఎమ్మెల్యే

రాజస్తాన్‌ నుంచి రాజ్యసభకు మాజీ ప్రధాని

‘తెలంగాణ బీజేపీ నేతలు కొత్త బిచ్చగాళ్లు’

 సీరియల్‌ మాదిరిగా టీడీపీ నుంచి చేరికలు

‘ఆ రెండు బిల్లులు ఉపసంహరించుకోవాలి’

‘టీఆర్‌ఎస్‌ గుండెల్లో గుబులు పుడుతోంది’

జేసీ ప్రభాకర్‌రెడ్డికి చేదు అనుభవం..

టీడీపీ నేతల గుండెల్లో  ‘ఆగస్టు’ గండం

‘అన్న క్యాంటీన్లలో రూ. 150 కోట్ల స్కాం’

అవమానిస్తూనే ఉన్నారు; పబ్లిసిటీ కోసమే!

మరో 20 ఏళ్లు జగనే సీఎం

అభివృద్ధిపై విస్తృత ప్రచారం

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఖర్గే!

మేమంటే.. మేమే! 

బిగ్‌షాక్‌; బీజేపీలోకి టీడీపీ, జనసేన నేతలు

26న ఎమ్మెల్సీ ఎన్నికలు‌..!

మిస్టర్‌ పీఎం.. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది

అక్కడ నవ్వడమా? సిగ్గుచేటు!

‘చింతమడక స్కీమ్‌’ అని పెట్టినా ఓకే..కానీ

‘పైసా ఇవ్వకుండా మాపై విమర‍్శలు సిగ్గుచేటు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కనకాల’పేటలో విషాదం

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!