క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా..

17 Mar, 2019 16:24 IST|Sakshi

సాక్షి, కడప : క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి మైసూరారెడ్డి వెల్లడించారు. ఆయన ఆదివారం ఇక్కడ రాయలసీమ హక్కుల సాధనపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతం కోసమే పని చేస్తానని, రాజకీయేతర ఉద్యమం చేస్తానని తెలిపారు. ఉద్యమం పార్టీగా మారితే క్రియాశీలక పాత్ర పోషిస్తానని ఆయన పేర్కొన్నారు. సీమ సమస్యల పరిష్కారానికి అజయ్‌ కల్లం నేతృత్వంలో ఓ కమిటీ వేయనున్నట్లు మైసూరారెడ్డి ప్రకటించారు. రాయలసీమ హక్కుల సాధనకు మహాసభ నిర్వహించాలని నిర్ణయించామని, ఎన్నికల తర్వాత సభ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా చాలాకాలంగా మైసూరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం విదితమే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు