ఇమ్రాన్‌ ఖాన్‌కు సమన్లు

3 Aug, 2018 20:30 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) సమన్లు జారీ చేసింది. ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రొవిన్స్‌ ఖజానాకు భారీ నష్టం కలిగించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆగష్టు 7న తమ ఎదుట హాజరుకావాలని అవినీతి వ్యతిరేక విభాగం శుక్రవారం సమన్లు పంపింది. 

2013 నుంచి ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రొవిన్స్‌లో పీటీఐ అధికారంలో ఉంది. సుమారు 72 గంటలపాటు హెలికాఫ్టర్‌ను ఆయన వాడారని, తద్వారా  ఖజానాకు రూ. 2.17 మిలియన్ల నష్టాన్ని కలిగించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. జూలై 18న తమ ఎదుట హాజరుకావాలని ఎన్‌ఏబీ బెంచ్‌ ఆయనకు సమన్లు జారీ చేసింది. అయితే ఎన్నికల హడావుడిలో ఉండటం వల్ల హాజరు కావటం వీలు కాదని ఇమ్రాన్‌ తరపు న్యాయవాది బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ తేదీని మారుస్తూ ఆగష్టు 7న విచారణకు తమ ఎదుట హాజరుకావాలని నేడు మరోసారి సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఆగష్టు 11న ఆయన ప్రధానిగా ప్రమాణం చేయబోతున్న విషయం తెలిసిందే. (షాక్‌: ఇమ్రాన్‌కు పోటీగా...)

మరిన్ని వార్తలు