కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది

13 Jul, 2020 06:01 IST|Sakshi

నాదెండ్ల మనోహర్‌ పేరుతో జనసేన  పార్టీ ప్రకటన

పది రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసించిన పవన్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందంటూ బీజేపీ, జనసేన పార్టీల సంయుక్త సమావేశంలో నేతలు అభిప్రాయపడినట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఇరు పార్టీల నేతల వీడియో కాన్ఫరెన్స్‌ జరిగినట్టు నాదెండ్ల మనోహర్‌ పేరిట జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా విస్తరిస్తున్న వ్యాధిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పని చేయడం లేదని తీర్మానించినట్టు తెలిపారు.

క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది రక్షణ విషయంలో సర్కారు వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడినట్టు వెల్లడించారు. కరోనా నివారణలో ఎక్కడ లోటుపాట్లు ఉంటే అక్కడ ప్రజల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో కొత్తగా 1,088.. 108, 104 అంబులెన్సులను ప్రారంభించడం.. అలాగే కరోనా టెస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును పవన్‌ కళ్యాణ్‌ పదిరోజుల క్రితం ప్రశంసించడం తెలిసిందే.  

మరిన్ని వార్తలు