ఫ్యాను గాలికి సైకిల్‌ కొట్టుకుపోవడం ఖాయం

14 May, 2018 10:26 IST|Sakshi
వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న నదీంఅహమ్మద్, డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ  సమన్వయకర్త నదీంఅహ్మద్‌

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీ చేరిక సభలో వైఎస్సార్‌సీపీ నేతలు  

ఓడీ చెరువు: ఫ్యాను గాలికి సైకిల్‌ కొట్టుకుపోవడం ఖాయం.. రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం అని ఆ పార్టీ హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త నదీం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ సిద్దారెడ్డి అన్నారు. ఆదివారం ఓడీ చెరువు మండలం కొండకమర్లలో ముస్లిం మైనార్టీ నాయకులు పొగాకు నిషార్, పొగాకు సుల్తాన్, పొగాకు మైనుద్దీన్, పొగాకు చాంద్‌బాషా ఆధ్వర్యంలో భారీ ఎత్తున టీడీపీ నుంచి ఎస్సీ, బీసీ,మైనారిటీ వర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

నవరత్నాలుతో బడుగులకు సంక్షేమ పథకాలు : ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నదీం అహమ్మద్‌ మాట్లాడుతూ ముస్లిం సంక్షేమానికి పాటుపడింది ఒక్క వైఎస్సార్‌ మాత్రమే అన్నారు.ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు. రిజర్వేషన్‌ ఇవ్వడం వల్లే ముస్లింలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. రాజన్న అడుగుజాడల్లో ఆయన తనయుడు జగనన్న నడుస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపారన్నారు.

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి వక్ఫ్‌బోర్డు మంత్రిగా ఉన్నా ఒక్క అభివృద్ధి పనీ చేసిందిలేదన్నారు.  పుట్టపర్తి, కదిరి సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ సిద్దారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రవేశపెట్టనున్న నవరత్నాలతో అట్టడుగు స్థాయి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మతి భ్రమించిందన్నారు. అనంతరం కొండకమర్ల పంచాయతీ పరిధిలోని డబురువారిపల్లి, మల్లోల్లపల్లి, మారుతీ తండా, గజ్జిబండతండా, బత్తినపల్లి, దిగువపల్లి, నాయనాకోట, చెరువు వాండ్లపల్లి నుంచి భారీగా చేరారు. పార్టీలో చేరిన వారికి నేతలు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముస్లిం మైనార్టీ నాయకులు పొగాకు నిషార్, పొగాకు సుల్తాన్, పొగాకు మైనుద్దీన్, పొగాకు చాంద్‌బాషా మాట్లాడుతూ మాట్లాడుతూ టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను చూసి సహించలేకే టీడీపీని వీడి  వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు