బాబుకు ఏపీలో ఓటమి ఖాయం

9 Oct, 2018 01:08 IST|Sakshi

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో టీడీపీ ఓడిపోవడం ఖాయమైపోయిందనే ఉద్దేశంతోనే ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు మకాం మార్చాలనుకుంటున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. భవిష్యత్‌ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తెలంగాణలో నలుగురైదుగురు తన చెంచాలను గెలిపించుకోవాల ని భావిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలతో ఏర్పడే మహాకూటమి ఆ పార్టీలకే మహాగూటమిలా మారుతుం దని అన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మాట్లాడారు.

‘ఎన్నికల తేదీలు రావడంతో కాంగ్రెస్‌కు ఆశాభంగమైంది. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్ని కలు రావని కాంగ్రెస్‌ ఆశ పడింది. కాంగ్రెస్‌ ఇంకా కోర్టులపై ఆశ పెట్టుకున్నట్లుంది. కాంగ్రెస్‌కు చేతనైతే ఎన్నికల కమిషన్‌ దగ్గరకు వెళ్లాలికానీ కోర్టుల చుట్టూ తిరగడమేంటీ? మర్రి శశిధర్‌రెడ్డికి దమ్ముంటే తలసాని శ్రీనివాస్‌పై గెలవాలి. కాంగ్రెస్‌కు దమ్ముంటే పొత్తుల్లేకుండా మాతో నేరుగా తలపడాలి. ఉత్తమ్‌ పెద్ద బట్టేబాజ్‌. సీఎం పదవికి గౌరవం ఇవ్వకుండా కేసీఆర్‌ను బట్టే బాజ్‌ అంటారా? 14 ఏళ్లు శాంతియుతంగా ఆందోళన చేసిన కేసీఆర్‌ రాష్ట్రానికి ఏం అన్యాయం చేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు’ అని ప్రశ్నించారు.

ఉత్తమ్‌ మా ఇంటికొచ్చారు: నర్సారెడ్డి
కాంగ్రెస్‌లో చేరుతారని జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే, రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ తూంకుంట నర్సారెడ్డి ఖండించారు. ‘4 నెలల కింద రోడ్డుప్రమాదంలో గాయపడ్డాను. ఇటీవలే కోలుకున్నాను. చాలా మంది నేతలు నన్ను పరామర్శించేందుకు నా ఇంటికి వచ్చిపోతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, మరికొందరు నేతలు ఆదివారం మా ఇంటి కి వచ్చి పరామర్శించారు. ఎలాంటి రాజకీయాల చర్చలు జరగలేదు’ అని ఓ ప్రకటనలో తెలిపారు.  

మరిన్ని వార్తలు