నీ ‘నామ’మే..! 

14 Jun, 2019 07:10 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: పదవులపరంగా జిల్లాకు మరో అవకాశం లభించింది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం లభించినట్లయింది. దీంతో రాజకీయ చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లాకు మరింత ప్రాధాన్యం లభించిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం నుంచి లోక్‌సభకు ఎన్నికైన నామా నాగేశ్వరరావు మొదటిసారి టీడీపీ ఎంపీగా అడుగిడితే.. రెండోసారి టీఆర్‌ఎస్‌ ఎంపీగా కాలుమోపనున్నారు. మొదటి పర్యాయం టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తే.. ఐదేళ్ల విరామం తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీకి అదే లోక్‌సభా పక్ష నాయకుడిగా వ్యవహరించే అవకాశం దక్కింది.

2009లో తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా ఎన్నికైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆరుగురు లోక్‌సభ సభ్యులు గల టీడీపీకి లోక్‌సభా పక్ష నేతగా వ్యవహరించిన నామా నాగేశ్వరరావు.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటీవలి కాలం వరకు టీడీపీలోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటమి  చవిచూసిన ఆయన.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఉనికి కోల్పోతున్న దశలో ఆయన లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిందే తడవుగా ఆయనకు టీఆర్‌ఎస్‌ ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టికెట్‌ ఇవ్వడంతో ఆయన భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరిపై విజయం సాధించారు. ఐదేళ్లపాటు టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిగా వ్యవహరించిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న టీఆర్‌ఎస్‌.. నామాకు టీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చింది.

హైదరాబాద్‌లో ఎంపిక.. 
ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నామాను పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. లోక్‌సభ సభ్యుడిగా అనుభవం ఉండడంతోపాటు జాతీయ స్థాయి రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉండడాన్ని, సమస్యలపై అవగాహన ఉండడం, ప్రజల వాణిని వినిపించగల నేర్పు ఉండడం వంటి అంశాలు నామా టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడానికి ఉపకరించాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2009లో టీడీపీ నుంచి ఆరుగురు లోక్‌సభకు ఎన్నిక కాగా.. అందులో తెలంగాణ నుంచి నామా నాగేశ్వరరావుతోపాటు ఆదిలాబాద్‌కు చెందిన రమేష్‌ రాథోడ్‌ ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి ఇద్దరే ఎన్నికైనా ఆయనకు జాతీయ నేతలతో గల సంబంధాలు.. అప్పట్లో చంద్రబాబు నాయుడితో గల సాన్నిహిత్యం ఆయనను టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిని చేసింది.

ఇప్పుడు సైతం సీఎం కేసీఆర్‌తో గల సాన్నిహిత్యం, గత అనుభవం వంటి అంశాలు ఆయనను లోక్‌సభ టీఆర్‌ఎస్‌ పక్ష నాయకుడిగా అయ్యేలా చేసిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నాయకుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజా సమస్యలపై ఆయనకు గళమెత్తే అవకాశం లభించినట్లయింది.  సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, పలు రైల్వే లైన్ల ఏర్పాటు వంటి అంశాలను సభలో ప్రస్తావించి.. పరిష్కరించడానికి మరింత అవకాశం లభించినట్లయిందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు విజయం సాధించడం అనంతరం ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించి మెజార్టీ మండలాల్లో ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడంతోపాటు ఖమ్మం జెడ్పీ చైర్మన్‌ పదవిని సైతం కైవసం చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం వ్యక్తమవుతోంది. నామా టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడంతో జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

ఆ ధోరణి ప్రమాదకరం : మాయావతి

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

గులాబీ ఫామ్‌లు ఎవరికిస్తారో!

‘2 వేల కంటే 15 వేలు తక్కువా చంద్రబాబు’

ప్రశ్నించే వారుండొద్దా...?

ఎన్నికల వరకే రాజకీయాలు

వైఎస్సార్‌సీపీకి పూర్వవైభవం వస్తుంది..   

ట్విట్టర్‌లో టీ‘ఢీ’పీ!

నా కొడకల్లారా... ఏ రెడ్డి వస్తాడో చూస్తాం

‘బాబు.. మీ పెంపుడు కుక్కను కంట్రోల్‌ చెయ్‌’

కౌన్సిలర్‌ టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం

బాబును కేంద్రం జైలులో పెడుతుందని అనుకోను

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

కేబినెట్‌ నుంచి సిద్ధూ నిష్క్రమణ

కే ట్యాక్స్‌పై అసెంబ్లీలో చర్చిస్తాం

ఏపీలోనూ టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు

హామీలను మించి లబ్ధి

రాష్ట్రాన్ని నాశనం చేశారు 

ల్యాండ్‌ మాఫీయాలో ఎంపీ హస్తం

బీజేపీలో చేరిన టీడీపీ అధికార ప్రతినిధి

నా ఫ్లెక్సీలో ఎన్టీఆర్‌ ఫొటో.. తప్పేముంది?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!