‘అందుకే పవన్‌ నిందితులకు మరణ శిక్ష వద్దంటున్నాడు’

4 Dec, 2019 17:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : షాద్‌నగర్‌ ఘటన కేసులో నిందితుల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బాపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగామ సురేష్‌ డిమాండ్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌కు మహిళలంటే చిన్నచూపని, పార్టీ అధ్యక్షుడిగా పపన్‌ చేసిన వ్యాఖ్యలలో ఆయన అసలు నైజం కనిపిస్తోందని విమర్శించారు. రేపిస్టులకు మరణ శిక్ష అవసరం లేదన్న పవన్‌ వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమని, వెంటనే  తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పవన్‌ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది కలిగితే ఆ బాధ ఎంటో అప్పుడు తెలుస్తుందన్నారు. భవిష్యత్తులో తాను తప్పు చేస్తే శిక్షల నుంచి తప్పించుకోడానికే పవన్‌ రేపిస్టులకు మరణ శిక్ష అవసరం లేంటూ ప్రకటనలు చేస్తున్నాడని నందిగామ సురేష్‌ దుయ్యబట్టారు. 

చదవండి : ‘పవన్‌ మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి’

రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్‌ అవుతాయా?

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా