27న, 3న మోదీ సభలు

22 Nov, 2018 01:56 IST|Sakshi

     ప్రధాని, బీజేపీ అధినేత అమిత్‌షా బహిరంగ సభల షెడ్యూల్‌ ఖరారు

     25, 28, వచ్చే నెల 2న అమిత్‌షా సభలు

     48 నియోజకవర్గాల్లో స్వామి పరిపూర్ణానంద ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు చోట్ల నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొనేందుకు బీజేపీ ప్రముఖులు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనలు ఖరారయ్యాయి. ఏయే జిల్లాల బహిరంగ సభల్లో వారు పాల్గొంటారన్న షెడ్యూల్‌ను వారి ఆమోదం మేరకు రాష్ట్ర పార్టీ ఖరారు చేసింది. ఈ నెల 27న ఉదయం నిజామాబాద్‌లో, మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో మోదీ పాల్గొననున్నారు. డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలోనూ ప్రధాని పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక అమిత్‌షా ఈనెల 24న హైదరాబాద్‌ చేరుకొని 25న ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు.

ఈనెల 28, వచ్చే నెల 2న సభలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో స్వామి పరిపూర్ణానంద, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలతోపాటు కేంద్ర మంత్రులు మొత్తంగా 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రచారం చేస్తారని బీజేపీ ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. ఇప్పటికే కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా హైదరాబాద్‌లోనే ఉండి పార్టీ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యానాథ్, ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్‌ను రెండుమూడు రోజుల్లో విడుదల చేసేం దుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తోంది.

మోదీ పర్యటన షెడ్యూల్‌..
- ఈ నెల 27న ఉదయం నిజామాబాద్‌లో బహిరంగ సభ.
మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ.
డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లో బహిరంగ సభ.

అమిత్‌ షా పర్యటన షెడ్యూల్‌
ఈ నెల 24న...
- రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ రాక. 
25న మధ్యాహ్నం 12 గంటలకు పరకాలలో బహిరంగ సభ
మధ్యాహ్నం 1:45 గంటలకు నిర్మల్‌లో సభ
మధ్యాహ్నం 3:20 గంటలకు దుబ్బాకలో సభ
సాయంత్రం 4:45 గంటలకు మేడ్చల్‌లో బహిరంగ సభ

ఈ నెల 28న...
ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌ రాక
మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్‌లో బహిరంగ సభ
మధ్యాహ్నం 2:00 గంటలకు చౌటుప్పల్‌లో సభ
మధ్యాహ్నం 3:45 గంటలకు లిబర్టీ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు రోడ్‌షో.
సాయంత్రం 5:45 గంటలకు ఎల్బీనగర్‌లో బహిరంగ సభ.

వచ్చే నెల 2న...
ఉదయం 11 గంటలకు బేగంపేట రాక
మధ్యాహ్నం 12 గంటలకు నారాయణపేటలో బహిరంగ సభ
1:35 గంటలకు ఆమనగల్‌లో కల్వకుర్తి నియోజకవర్గ బహిరంగ సభ.
3 గంటలకు ఉప్పల్‌లో, మల్కాజిగిరిలో రోడ్‌ షోలు
సాయంత్రం 5:15 గంటలకు కామారెడ్డిలో బహిరంగ సభ.

స్వామి పరిపూర్ణానంద ఎన్నికల ప్రచారం..
22న: అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్‌ అర్బన్, కోరుట్ల, ఎల్లారెడ్డి, మల్కాజ్‌గిరి.
23న: దేవరకొండ, వరంగల్, ఆలేరు,పటాన్‌చెరు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్,చాంద్రాయణగుట్ట.
24న: మక్తల్, కల్వకుర్తి, పరిగి,సంగారెడ్డి, కూకట్‌పల్లి, మలక్‌పేట.
25న: ముథోల్, నిజామాబాద్‌ రూరల్, సిద్దిపేట, వేములవాడ, పెద్దపల్లి, సికింద్రాబాద్‌.
26న: భద్రాచలం, నర్సంపేట్, నల్లగొండ,షాద్‌నగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌.
27న: సిర్పూర్, చెన్నూర్, కరీంనగర్,ఆర్మూర్, మెదక్, సనత్‌నగర్‌.
28న: భూపాలపల్లి, ఇల్లందు,నాగార్జునసాగర్, మహబూబ్‌నగర్,నారాయణ్‌పేట్, మహేశ్వరం.
29న: మహబూబాబాద్, మంచిర్యాల,ధర్మపురి, బోధన్, కామారెడ్డి, ఉప్పల్, అలంపూర్‌. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు