భయమెందుకు మమత?

2 Feb, 2019 16:25 IST|Sakshi

బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ

కోల్‌కత్తా:  లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలకమైన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. దుర్గాపూర్‌ ర్యాలీలో పాల్గొన్న మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. సీఎం మమతా బెనర్జీపై విమర్శల వర్షం కురిపించారు. తృణమూల్‌ పాలన ప్రజాస్వామ్యం బద్ధంగా జరగడంలేదని,  మమతకు అభివృద్ధి కన్నా వ్యక్తిగత రాజకీయాలే ముఖ్యంగా మారాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని గిరిజన ప్రజలంతా బీజేపీకి దగ్గరవుతున్నరనే అక్కసుతో వారిని హత్య చేస్తూ హింస సృష్టిస్తున్నారని మోదీ ఆరోపించారు.

బెంగాల్‌ ప్రజలు చాలాకాలం నుంచి మార్పు కోరుకుంటున్నారనీ, రానున్న ఎన్నికల్లో అది సాకారం అవుతుందని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే మమత భయపడుతున్నారని, ఏమీ తప్ప చేయని వారైతే భయమెందుకని ప్రశ్నించారు. సభలో మోదీ మాట్లాడుతూ.. పేదలకు, రైతులకు సాకారం చేకూరే విధంగా బడ్జెట్‌ను రూపాకల్పన చేసినట్లు వివరించారు. బెంగాల్‌లో వెనుకబడిన మాత్వా గిరిజన ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ సభకు విశేష​ స్పందన లభించింది. సభా ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొనటంతో మధ్యలోనే మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

మరిన్ని వార్తలు