‘అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా’

28 Sep, 2019 20:01 IST|Sakshi

ముంబై : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) కీలక నేత, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ తన ఎమ్మెల్యే పదవి రాజీనామాకు గల కారణాలను వివరించారు. తన వల్ల మామయ్య శరద్‌ పవార్‌కు అప్రతిష్ట రాకూడదన్న కారణంగానే తాను రాజీనామా చేశానని అజిత్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. శరద్‌ పవార్‌తో సంబంధాలు బెడిసి కొట్టడం వల్లే రాజీనామా చేశారన్న ఊహాగానాలు కొట్టిపడేశారు.

(చదవండి : శరద్‌పవార్‌పై మనీల్యాండరింగ్‌ కేసు)

శరద్ పవార్‌కు కో ఆపరేటివ్ బ్యాంకుతో ఎలాంటి సంబంధమూ లేదని, అయినా శరద్ పవార్‌ను ఇందులోకి ఎందుకు లాగారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శరద్ పవార్ కారణంగానే ఇంత ఉన్నత స్థితికి తాను చేరుకున్నానని స్పష్టం చేశారు. ‘మనీ ల్యాండరింగ్‌ కేసులో షరద్‌ను పేరును చేర్చారనే భాధతోనే నా రాజీనామా పత్రాన్ని శుక్రవారం స్పీకర్‌ వ్యక్తిగత సహాయకుడికి అందిచాను. ఎవరిని సంప్రదించకుండా రాజీనామా చేసినందుకు క్షమించాలి. షరద్‌ పవార్‌ నాకు బంధువు కావడం వల్లే ఆయనను అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రలు చేస్తున్నారు’  అని అజిత్‌ ఆరోపించారు. 

(చదవండి : అజిత్‌ రాజీనామా ఎందుకు?)

 కో- ఆపరేటివ్ బ్యాంకులు రైతులకు రుణాలనిస్తూ సహాయం చేస్తుంటాయని, అయినా సరే ఒక్కోసారి రుణాలు పక్కదారి పడుతుంటాయని అన్నారు. అయినా, కేవలం 11,000 కోట్ల మాత్రమే డిపాజిట్ ఉండే బ్యాంకులో 25 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని అజిత్ పవార్ ప్రశ్నించారు. మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఎంఎస్‌సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎన్‌సీపీ చీఫ్‌, మాజీ సీఎం శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరరెక్టర్‌(ఈడీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యోగి మరోసారి నిరూపించుకున్నారు: ఒవైసీ

‘అబద్దం చెప్పి.. ఉత్తమ్‌ ఎంపీగా గెలిచారు’

‘బీజేపీ విమర్శలు.. టీడీపీకి జిరాక్స్‌’

ఆ రోజు దగ్గరలోనే ఉంది - ఉద్ధవ్ ఠాక్రే 

దివ్య స్పందన స్థానంలో మరో వ్యక్తి

మాజీ సీఎంకు ప్రతిపక్ష స్థానం దక్కేనా?

చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై ఎమ్మెల్యే కాకాణి ఫైర్‌

అజిత్‌ రాజీనామా ఎందుకు?

ఓడినా తగ్గని చింతమనేని అరాచకాలు

కేయూలో అధికారి సంతకం ఫో​​​​​​ర్జరీ

చేరికలు కలిసొచ్చేనా?

కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్‌

ప్రమాదంలో ప్రజాస్వామ్యం!

సీనియారిటీ కాదు..సిన్సియారిటీ ముఖ్యం

గుత్తా రాజీనామాను కోరండి

టీఆర్‌ఎస్‌లోకి అజహరుద్దీన్‌?

తెలంగాణ సచివాలయానికి తాళం! 

మా పైసలు మాకు ఇస్తలేరు..

టీఆర్‌ఎస్‌లోకి మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌!

గవర్నర్‌కు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లేఖ!

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఫైర్‌

బీజేపీ ఎన్నికల అస్త్రం బయటకు తీసిందా?

పయ్యావుల కేశవ్ అత్యుత్సాహం

శరద్ పవార్‌కు మద్దతుగా శివసేన

'రాష్ట్రమంతా హుజూర్‌నగర్‌ వైపే చూస్తోంది'

‘కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు’

చంద్రబాబు గగ్గోలుకు ఆంతర్యం ఏమిటో?

ఆ మహిళా ఎమ్మెల్యేను ప్రగతి భవన్‌కు రానివ్వలేదు!

నో మోదీ.. కేరళ బ్యూటీ అదే: బాలీవుడ్‌ హీరో

‘ఆ ఇద్దరి’కి చిరంజీవి సలహా ఇదే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాబా భాస్కర్‌కు నాగ్‌ క్లాస్‌

రాహుల్‌-వరుణ్‌ గొడవను నాగ్‌ సెట్‌ చేస్తాడా?

అమితాబ్‌ చెప్పినా చిరు వినలేదట

మరోసారి పెళ్లి చేసుకుంటున్న బీబర్‌!

ఎలిమినేట్‌ అయింది అతడే!

కల్యాణ్‌ బాబాయికి చూపిస్తా: వరుణ్‌ తేజ్‌