-

దేశ ఆర్థిక వృద్ధి దారుణంగా నెమ్మదించింది

9 May, 2019 04:39 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి దారుణంగా నెమ్మదించిందనీ, స్థూల ఆర్థిక సూచీలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని కాంగ్రెస్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. సమాచారాన్ని దాయడం, తమకు ఇష్టమొచ్చినట్లుగా దాన్ని మార్చడంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఎంతో నైపుణ్యం చూపిస్తున్నారని చిదంబరం ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుత ఆర్థిక స్థితి గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ దోషాలతో కూడిన వివరాలు ఇస్తోంది. బహుశా ఆర్థిక వ్యవస్థకు ఇదే బలహీనమైన సమయం కావచ్చు. బీజేపీ హయాంలో భారీగా దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థను బాగుచేయడానికి తర్వాతి ప్రభుత్వం భారీగానే కష్టపడాల్సి ఉంటుంది’ అని చిదంబరం పేర్కొన్నారు.. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితి ఏంటనేది ఎన్‌ఎస్‌ఎస్‌వో, సీఎస్‌వో లెక్కలు చూస్తే అర్థమవుతుందన్నారు.

మరిన్ని వార్తలు