ఎంపీ సుమలత ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్‌

8 Aug, 2019 08:36 IST|Sakshi

ఇప్పుడు అవసరమా మేడం?

బెంగళూరు : బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ మరణంతో బీజేపీ శ్రేణులు ఆవేదనలో ఉండగా, సినీ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్‌ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో కర్నాటక భవన్‌లో సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందగౌడ తదితరులతో సమావేశంలో పాల్గొన్న ఫోటోను అర్ధరాత్రి 12:18 గంటల సమయంలో సుమలత అప్‌లోడ్‌ చేశారు. దీనిపై పలువురు బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్‌లు చేశారు. దేశానికి ఎంతో సేవ చేసిన సుష్మా స్వరాజ్‌ మృతి చెందితే ఆమెను జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయంలో ఈ ట్వీట్‌ చేయడం అంత అవసరమా మేడం? అని ఒక నెటిజన్‌ ప్రశ్నించారు. దీంతో బుధవారం ఉదయం సుష్మా స్వరాజ్‌ మరణం దేశానికి తీరని లోటు అని సుమలత ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు