‘బెస్ట్‌ యాక్టర్‌.. బెస్ట్‌ డ్రామా!’

21 Jul, 2018 07:53 IST|Sakshi

టీడీపీ అవిశ్వాసం ఓ డ్రామా అంటూ కడిగేసిన నెటిజన్లు

సాక్షి, అమరావతి: కేంద్రంలోని బీజేపీ సర్కారుతో నాలుగేళ్ల పాటు అధికారాన్ని పంచుకుని ప్రత్యేక హోదాను గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు. కానీ, ఇప్పుడు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో ఎంపీ గల్లా జయదేవ్‌ బాగా మాట్లాడారంటూ, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళం వినిపించారంటూ ట్వీట్‌ చేయడం పట్ల సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు నెటిజన్లు.. నాలుగేళ్లుగా హోదా విషయాన్ని మరిచిపోయారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. 

హోదా మాటెత్తితే అరెస్టులు చేస్తానంటూ గతంలో హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని తప్పుబడుతూ ‘బెస్ట్‌ యాక్టింగ్‌... బెస్ట్‌ యాక్టర్‌ చంద్రబాబు... బెస్ట్‌ డ్రామా’ అని ట్వీటర్‌లో పోస్టింగులు పెట్టారు. ‘ప్యాకేజీ ముద్దు... హోదా వద్ద’న్న బాబు మాటలను గుర్తు చేశారు. టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్రం సంగతి తేల్చడం సరే.. మీరిచ్చిన హామీల సంగతేంటని కొందరు సీఎంను ప్రశ్నించారు. 

ట్వీటర్‌, ఫేస్‌బుక్, గూగుల్‌లో ఇలాంటి కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్టింగ్‌ పెట్టిన 4 గంటల్లోనే 232 మంది వ్యతిరేకంగా కామెంట్స్‌ చేశారు. గల్లా జయదేవ్, నారా లోకేష్‌ ట్వీట్‌లకూ ఇదే రీతిలో వ్యతిరేకత వచ్చింది.  

మరిన్ని వార్తలు