‘బొండా’గిరిలో కొత్తకోణం

28 Feb, 2018 12:28 IST|Sakshi
అప్పల నర్సమ్మ

దాయాదుల్లో వైరం ఆసరాగా

విజయవాడ :  బొండాగిరిలో కొత్త కోణం తెరపైకి తెచ్చారు. తాము అక్రమంగా చేజిక్కించుకున్న ఆస్తిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఎదురు కావటంతో బొండా అనుచరులు దాయాదుల మధ్య వైరం ఆసరాగా చేసుకొని పావులు కదుపుతున్నారు.  స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబ కలహాలను సాకుగా తీసుకొని  ఆ భూమిని ఖాళీ చేయకుండా పాగా వేసేందుకు బొండా అనుచరులు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఈ క్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యానారాయణ పెద్ద కుమారుడు కేశిరెడ్డి వెంకటేశ్వరరావు భార్య అప్పల నర్సమ్మను బొండా అనుచరుడు, రియల్టర్‌ మాగంటి బాబు విజయవాడ సబ్‌–కలెక్టర్‌ కార్యాలయానికి తీసుకొచ్చి మీడియాను పిలిచారు.

ప్రభుత్వం ఇచ్చిన భూమి గాకుండా స్వాతంత్య్ర సమరయో«ధుని పూర్వార్జిత ఆస్తుల ద్వారా వచ్చిన భూమి 1.69 సెంట్లను గత ఏడాది ఏప్రిల్‌లో అప్పల నర్సమ్మ, మాగంటి బాబుకు విక్రయించింది. స్వాతంత్ర సమరయోధుడి కోటాలో వచ్చిన  భూమిని బొండా అనుచరులు రకరకాలుగా నకిలీ డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ వ్యవహారాలు సీఐడీ విచారణతో బహిర్గతమైంది. బొండా అనుచరులు తాము కొనుగోలు చేసినట్లు చెబుతున్న రామిరెడ్డి కోటేశ్వరరావు ఆ భూమికి తనకు సంబంధం లేదని, నకిలీ డాక్యుమెంట్లతో మాగంటి బాబు మోసగించాడని ప్రకటించారు. దీంతో బొండాగిరి బట్టబయలైంది. ఈ క్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబంలో దాయాదుల వైరాన్ని బొండా అనుచరలు తెరపైకి తెచ్చారు.

ఎవరి భూమీ కబ్జా చేయలేదు : మాగంటి బబు
తాను ఎవరి భూమి కబ్జా చేయలేదని రియల్టర్, బిల్డర్‌ మాగంటి బాబు స్పష్టం చేశారు. సబ్‌–కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణలో పూర్తి విషయాలు బయటకు వస్తాయన్నారు.  తనది తప్పుని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. సురేష్‌బాబు దొంగ కాగితాలతో రకరకాల ఫిర్యాదులు చేస్తున్నాడని ఆరోపించారు.

నా మరిది కొడుకులు  మోసం చేశారు:  అప్పల నర్సమ్మ
తన మరిది కుమారుడు కేశిరెడ్డి రామకృష్ణ కుమారులు కేశిరెడ్డి సురేష్‌బాబు, శ్రీనివాసరావు తనను మోసం చేశారని కేశిరెడ్డి సూర్యనారాయణ భార్య అప్పలనర్సమ్మ మీడియాకు చెప్పారు. సబ్‌–కలెక్టర్‌ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ కేశిరెడ్డి సురేష్‌బాబు తన ఆస్తిని కాజేసేందుకు చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. తన భర్త ద్వారా వచ్చిన పూర్వార్జిత ఆస్తిని కూడా తనను విక్రయించకుండా దొంగ డాక్యుమెంట్లతో  అడ్డుపడ్డారని ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధుడి కోటాలో వచ్చిన భూమిని కూడా  తనకు దక్కకుండా సురేష్‌బాబు అతని కుటుంబసభ్యులు  తప్పుడు డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మాగంటి బాబు ఎటువంటి మోసానికి పాల్పడలేదని వెల్లడించారు.

మరిన్ని వార్తలు