బాలకృష్ణ..జాగ్వార్‌ సినిమా సీడీ విడుదల చేస్తాడనుకుంటా

5 May, 2018 09:12 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: మాగడి నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి బాలకృష్ణ తనకు సంబంధించిన సీడీ ఏదో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని, బహుశా అది నా మొదటి సినిమా జాగ్వార్‌ సీడీనే అయ్యుంటుందని కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ ఎద్దేవా చేసాడు. శుక్రవారం మాగడి పట్టణంలో రోడ్‌షో నిర్వహించి జేడీఎస్‌ అభ్యర్థి ఎ మంజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన నిఖిల్‌ ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ప్రసంగించారు. తాను సీడీలు విడుదల చేసేంత గొప్ప పనులు ఏం చేయలేదన్నారు.

ఓటమి భయంతో బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీడంలేదన్నారు. అందుకే జేడీఎస్‌ అభ్యర్థి క్రమ సంఖ్యలను మార్పు చేసి తప్పుడు పప్రచారం చేస్తూ ఓటర్లను తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడని, ఓటర్లు ఓటు వేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఇందుకు సంబంధించి క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు