రాజకీయాల్లో ‘మర్యాద’ అరుదైన గుణం

16 Apr, 2019 11:32 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ తులాభారం సందర్భంగా గాయపడి, ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నసంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రిలో ఉండి కూడా ఆయన ట్విటర్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు.  కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్‌, తిరువనంతపురంలో తనపై పోటీకి సై అన్న ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి దివకరణ్‌ తనను పరామర్శించారని పేర్కొంటూ సోషల్‌ మీడియా ద్వారా సంతోషాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా  ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు.  భారతీయ రాజకీయాల్లో మర్యాద, మంచితనము చాలా అరుదైన విషయమంటూ తన ఆనందాన్ని వెలిబుచ్చారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్పత్రిలో ఉన్న తనను  పరామర్శించారని శశిథరూర్ ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో  చాలా  బీజీగా ఉన్నా కూడా తనను కలిసేందుకు నిర్మలా సీతారామన్ ఆస్పత్రికి వచ్చారన్నారు. ఆమె అడిగిన ప్రశ్నలకు సైగలతో సమాధానమిచ్చామన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని శశి థరూర్‌ ట్వీట్ చేశారు.

అలాగే సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి దివకరణ్‌ తనకు ఫోన్‌ చేసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారని, ఆసుపత్రి ఉన్నతాధికారులతో మాట్లాడి.. బాగవుతుందనే భరోసా ఇచ్చారని  ట్వీట్‌ చేశారు.  అధైర్యపడవద్దని చెప్పారనీ, కానీ  వీరి  అభిమానం చూసాక గతంకంటే ఎక్కువ ధైర్యంగా ఉన్నానని పేర్కొన్నారు.  

కాగా కేరళ రాజధాని తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచిన శశిథరూర్‌..మరోసారి బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం కేరళలో ఎన్నికల ప్రచార క్రమంలో సోమవారం కేరళ నూతన సంవత్సరాది విషు పండగను పురస్కరించుకుని తంపనూర్‌ ప్రాంతంలోని గాంధారి అమ్మన్‌ కోవిళ్‌ ఆలయ ప్రాంగణంలో తులాభారం సందర్భంగా గాయడ్డారు. ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి దివకరణ్‌తో శశిథరూర్‌ పోటీపడతున్నారు.  రెండవ దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 23న అక్కడ పోలింగ్‌ జరగనుంది. 

మరిన్ని వార్తలు