మిత్రపక్షం వద్దన్నా.. మాజీ సీఎం కొడుకుకే టికెట్‌

2 Oct, 2019 15:31 IST|Sakshi
నారాయణ రాణే కొడుకు నితేశ్‌

కనకవల్లి సీటుపై బీజేపీ-శివసేన మధ్య హోరాహోరీ

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే కొడుకు నితేశ్‌ ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. బీజేపీ టికెట్‌ మీద కనకవల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. 

మిత్రపక్షం శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కనకవల్లి టికెట్‌ను నితేశ్‌కే ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. నితేశ్‌ ఇప్పటీకి బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోలేదు. అయితే, స్థానికంగా నితేశ్‌కు ఉన్న విజయావకాశాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు బీజేపీ బీఫామ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. నితేశ్‌ టికెట్‌ విషయమై నారాయణ రాణే మంగళవారం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయి చర్చించిన సంగతి తెలిసిందే. నారాయణ రాణే ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. త్వరలోనే కొడుకును పార్టీలోకి తీసుకొని.. టికెట్‌ కట్టబెట్టాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు రాణే తీరుపై గుర్రుగా ఉన్న శివసేన.. నితేశ్‌కు కనకవల్లి టికెట్‌ ఇస్తే.. పోటీగా తాము సొంతంగా అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేసింది. నితేశ్‌కు బీజేపీ టికెట్‌ ఇస్తే.. కనకవల్లిలో మిత్రపక్షంగా ఉన్న కమల శ్రేణులకు, శివసైనికులకు మధ్యే ప్రధాన పోరు నడిచే అవకాశం కనిపిస్తోంది. 

>
మరిన్ని వార్తలు