పార్టీ మారాలనుకుంటే మారవచ్చు: నితీశ్‌

23 Jan, 2020 12:25 IST|Sakshi

పాట్నా: జేడీయూ సీనియర్‌ నేత పవన్‌ వర్మ ట్వీట్‌పై బీహార్‌ ముఖ్యమంత్రి నితిశ్‌ కుమార్‌ ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..తనకు ఇష్టమైన పార్టీలో పవన్‌ వర్మ చేరవచ్చని, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు నితీశ్‌ తెలిపారు. బీజేపీతో జేడీయూ పొత్తు విషయంలో నితిశ్‌ కుమార్‌ వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తుందని పవన్‌ వర్మ మంగళవారం ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ..ఫిబ్రవరి 8న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీతో పొత్తు విషయంలో నితిశ్‌ కుమార్‌ విముఖత వ్యక్తం చేశారని పవన్‌ వర్మ తెలిపారు. ఈ రకంగా బహిరంగంగా వ్యాఖ్యానించడం ఏ మేరకు సమంజసమని.. పార్టీ మారాలనుకుంటే మారవచ్చని పవన్‌ వర్మను ఉద్దేశించి నితిశ్‌ కుమార్‌ వ్యంగ్యంగా విమర్శించారు.
చదవండి: బదులు తీర్చుకున్న నితీశ్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు