నిజామాబాద్‌లో ఇండిపెండెంట్‌కి ఎంత క్రేజో..

25 Jan, 2020 17:25 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్‌, ఎంఐఎం‌కు హోరాహోరిగా తపపడుతున్నాయి. మూడ పార్టీలకు సీట్లు సమానంగా వస్తున్నాయి. హంగ్‌ దిశగా ఫలితాలు వస్తుండడంతో మేయర్‌ పీఠంపై పార్టీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇండిపెండెంట్‌ అభ్యర్థులను వలలో వేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్థిని రెండు పార్టీల నాయకులు వెంబడించారు. బైక్‌పై వెళ్తుండగా అడ్డుకొని తమ కారులో ఎక్కాలంటే..తమ కారులో ఎక్కాలని పోటాపోటీగా అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చారు. ఉక్కిరిబిక్కిరి అయిన ఇండిపెండెంట్‌ అభ్యర్థిని చివరికి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఓ కారులో తీసుకొని వెళ్లారు. 
 
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం నిజామాబాద్‌ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు గాను బీజేపీ 24, టీఆర్‌ఎస్‌ 15, ఎంఐఎం 18, ​కాంగ్రెస్‌ 2 స్థానాల్లో విజయం సాధించగా, ఒక చోట ఇండిపెండెంట్‌ అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్‌లో మేయర్ పదవిని ఆశించిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత పరాజయం చెందారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయీమ్ కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మేయర్‌ పదవిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఆధిక్యంలో ఉంటారన్నది తెలుస్తుంది.

మరిన్ని వార్తలు