మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు కరువు

11 Jan, 2020 18:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో జరగనున్నమున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు. మొత్తం 2,727 వార్డుల్లో 30శాతం స్థానాల్లో బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు. ఇదే విషయమై కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి శనివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నామినేషన్ల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోవడంపై ఇన్‌చార్జీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు మందు రాష్ట్రంలోని అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తామని ప్రగల్బాలు పలికిన బీజేపీ నాయకులు తీరా నామినేషన్‌ సమయానికి చేతులేత్తేయడం గమనార్హం. కాగా మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నిన్నటితో నామినేషన్లకు గడువు ముగిసింది.    

కామారెడ్డి : మున్సిపల్‌ ఎన్నికలు జరగకుండానే టీఆర్‌ఎస్‌ బోణీ చేసింది. బాన్సువాడ మున్సిపాలిటీలోని నాలుగో వార్డు కౌన్సిలర్ గా టీఆర్‌ఎస్‌కు చెందిన రుక్మిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కౌన్సిలర్ స్థానానికి రుక్మిణితో పాటు  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వప్న, టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి సంఘమిత్ర నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ రాజు తమ పార్టీ కౌన్సిలర్ అభ్యర్తిని స్వప్నను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ రాజు ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందారు. అయితే తాను ఇష్టపూర్వకంగానే నామినేషన్‌ను ఉపసంహరించుకున్నానని కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా కాంగ్రెస్‌ అభ్యర్తి స్వప్న, రెబల్‌ అభ్యర్థి సంఘమిత్రలు తమకు తాముగా పోటీ నుంచి తప్పుకోవడంతో రుక్మిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు