ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆమెకు తేడా ఏముంది?

23 Jun, 2019 14:21 IST|Sakshi

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బీజేపీ నేతలు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. కానీ బెంగాల్‌లో మమత సర్కార్‌ మాత్రం ఎలాంటి వేడుకలను నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మమతను.. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పోల్చూతూ.. స్థానిక బీజేపీ నేత కైలాష్‌ విజయవర్గీయ వ్యాఖ్యానించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా యోగా డేను నిర్వహించారు. పాకిస్తాన్‌, బెంగాల్‌ మాత్రమే నిర్వహించలేదు. ఇమ్రాన్‌కు, మమతకు పెద్దగా తేడాఏం లేదని దీంతో అర్థమయింది’ అని అన్నారు.

యోగాపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌పై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఆయన మానసిక స్థితి సరిగ్గాలేదని అన్నారు. ఆర్మీ డాగ్‌ యూనిట్‌ వెల్లడించిన రెండు ఫోటోలను శుక్రవారం ట్విటర్‌లో షేర్‌ చేసిన రాహుల్‌ దానికి ఇచ్చిన క్యాప్షన్‌తో విమర్శలకు తావిచ్చారు. ‘సైనిక సిబ్బందితో కలిసి కుక్కలు యోగాసనాలు వేస్తున్నాయి..ఇదే న్యూ ఇండియా’ అంటూ ఇచ్చిన క్యాప్షన్‌ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. రాహుల్‌ యోగా డేపై చేసిన వ్యాఖ్యలతో దేశాన్ని, సైనిక పాటవాన్ని అవమానించారని నెటిజన్లు మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు