ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ విడుదల

27 Apr, 2018 09:05 IST|Sakshi
నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న గిరీషా

మే 3వరకు నామినేషన్లు

మే 29 వరకు ఎన్నికల కోడ్‌

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జేసీ గిరీషా

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను గురువారం ఉదయం 10.30లకు ఎన్ని కల రిటర్నింగ్‌ అధికారి, జేసీ గిరీషా విడుదల చేశారు. ఆయన విలేకరులతో మా ట్లాడుతూ  అభ్యర్థులు ఏప్రి ల్‌ 26 నుంచి మే 3 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చునన్నారు. సెలవు రోజులు మినహా ప్రతిరో జూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కలెక్టరేట్‌లోని జేసీ కార్యాలయం వద్ద ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌లో నామినేషన్‌ దాఖలు చేసుకోవాలన్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 1,172 మంది ఓటర్లుగా ఉన్నారన్నారు. అందులో తిరుపతి పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో 261 మంది, చిత్తూరు పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో 354 మంది, మదనపల్లె పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో 557 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థితో పాటు మొత్తం ఐదుగురిని అనుమతిస్తామన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ నియామవళి అమలులో ఉందని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నిల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, పెయిడ్‌ న్యూస్, ఇతరత్రా ప్రచారాలను పర్యవేక్షించేందుకు ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటుచేశామన్నారు. 

మొదటి రోజు నామినేషన్లు నిల్‌
నామినేషన్‌ దాఖలకు మొదటి రోజైన గురువారం ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. నామినేషన్‌ దాఖలు చేయదలుచుకున్న అభ్యర్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఉండేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. ఈ ఏర్పాట్లను డీఎస్పీలు సుబ్బారావు, శ్రీకాంత్, టూటౌన్‌ సీఐ వెంకటకుమార్‌ పర్యవేక్షించారు.

షెడ్యూల్‌ ఇలా....
నామినేషన్ల స్వీకరణ – ఏప్రిల్‌ 26 నుంచి మే 3 వరకు
నామినేషన్ల పరిశీలన – మే 4
ఉపసంహరణ గడువు – మే 7
పోలింగ్‌ – మే 21 ఉదయం 8 నుంచి సాయంత్రం 4  వరకు
ఓట్ల లెక్కింపు – మే 24, అదే రోజు ఫలితాలు
ఎన్నికల కోడ్‌  – మే 29 వరకు

మరిన్ని వార్తలు