అనంతపురం: నామినేషన్‌ వేసిన అభ్యర్థులు

26 Mar, 2019 08:34 IST|Sakshi

సాక్షి,అనంతపురం అర్బన్‌: ఎన్నికల ప్రక్రియలో తొలి అంకమైన నామినేషన్‌ పర్వం సోమవారంతో ముగిసింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన 18వ తేదీ నుంచి చివరి రోజు 25వ తేదీ వరకు అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానాలకు 40 మంది అభ్యర్థులు 54 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు 278 మంది 400 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజున అనంతపురం పార్లమెంట్‌ నియోకవర్గానికి 14 మంది అభ్యర్థులు 16 సెట్లు , 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 208 మంది అభ్యర్థులు 262 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. 

  •  రెండు పార్లమెంట్‌ స్థానాలకు 40 మంది 54 సెట్లు దాఖలు 
  • 14 అసెంబ్లీ స్థానాలకు 278 మంది 400 సెట్లు దాఖలు 
  •  నేడు నామినేషన్ల పరిశీలన  

సోమవారం ప్రధాన పార్టీల నామినేషన్లు  
అనంతపురం పార్లమెంట్‌: టి.రంగయ్య (వైఎస్సార్‌సీపీ), జేసీ దివాకర్‌రెడ్డి (టీడీపీ), డి.జగదీశ్‌ (సీపీఐ), హంస దేవినేని (బీజేపీ) హిందూపురం పార్లమెంట్‌: గోరంట్ల మాధవ్‌ (వైఎస్సార్‌సీపీ), కురబ సవిత (వైఎస్సార్‌సీపీ), ఎన్‌.కిష్టప్ప (టీడీపీ), పార్థసారథి (బీజేపీ)   

జిల్లా ఓటర్లు 32,39,517 

  • పురుషులు 16,25,192
  •  మహిళలు 16,14,071, ఇతరులు 254
  •  జాబితాను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
  •  జనవరి 11న తుది జాబితాలో 30,58,909 మంది ఓటర్లు
  •  నమోదుతో పెరిగిన ఓటర్లు 1,80,608 మంది 

అనంతపురం అర్బన్‌ : ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఆ మేరకు జిల్లా ఓటర్లు 32,39517 మంది. ఇందులో పురుషులు 16,25,192 మంది, మహిళలు 16,14,071 మంది ఉన్నారు. థర్డ్‌ జెండర్‌ 24 మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరి 11న విడదుల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 30,58,909 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 15,39,936 మంది, మహిళలు 15,18,769 మంది, థర్డ్‌ జెండర్‌ 204 మంది ఉన్నారు. నవంబరు ఒకటి నుంచి ఈనెల 15 వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహించారు. దీంతో జిల్లాలో 1,80,608 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో పురుషులు 85,256, మహిళలు 95,302, థర్డ్‌ జెండర్‌ 50 మంది ఉన్నారు.  

మరిన్ని వార్తలు