బీజేపీయేతర సీఎంలు వ్యతిరేకించాలి : పీకే

13 Dec, 2019 10:04 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లు అమలుపై బీజేపీయేతర ముఖ్యమంత్రులు తమ వైఖరిని స్పష్టం చేయాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే ఈ బిల్లు వల్ల భారతదేశ ఆత్మ దెబ్బతింటుందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌, కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఈ చట్టంతోపాటు ఎన్నార్సీని తమ రాష్ట్రంలో అమలుచేయబోమని ప్రకటించారని, మిగతా 16 రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులు తమ వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కాగా, ఈ బిల్లుకు జేడీయూ పార్టీ లోక్‌సభలో మద్దతు తెలపడంపై పీకే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా జేడీయూ రాజ్యసభలోనూ ఈ బిల్లుకు మద్దతు తెలపడం గమనార్హం. మరోవైపు ఈ బిల్లును ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉండగా, దేశంలో ఉన్న శరణార్థులు ఈ బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  చదవండి : (మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే)

>
మరిన్ని వార్తలు