భయపడం.. పోరాడతాం

19 Jan, 2018 17:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీకి తాము భయపడటం లేదని, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎమ్మెల్యే అల్కా లాంబా అన్నారు. తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందని వ్యాఖ్యానించారు. అన్యాయానికి వ్యతిరేకంగా తమ గళం విన్పిస్తామని ప్రకటించారు.

అనర్హత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు వీరే..
ఆదర్శ శాస్త్రి-ద్వారక, అల్కా లాంబా- చాందినిచౌక్‌, అనిల్‌ వాజపేయి- గాంధీనగర్‌, అవతార్‌ సింగ్- కాల్‌కాజీ, జర్నైల్‌ సింగ్‌- రాజౌరి గార్డెన్‌, కైలాశ్‌ గెహిలట్- నజాఫ్‌గార్గ్‌, మందన్‌లాల్‌- కసుర్బానగర్‌, మనోజ్‌కుమార్‌- కోండ్లి, నరేశ్‌ యాదవ్-మెహరౌలి, నితిన్‌ త్యాగి-లక్ష్మీనగర్‌, జర్నైల్‌ సింగ్- తిలక్‌నగర్, ప్రవీణ్‌ కుమార్‌-జాంగ్‌పురా, రాజేశ్‌గుప్తా- వజీర్‌పూర్‌, రాజేశ్‌ రిషి- జానక్‌పురి, సంజీవ్‌ ఝా- బురారీ, సరితా సింగ్‌- రోహతాస్‌నగర్‌, సోమ్‌దత్- సదర్‌బజార్‌, శరద్‌కుమార్‌- నెర్లా, శివచరణ్‌ గోయల్‌- మోతినగర్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌- మందకా, విజేందర్‌ గార్గ్‌- రాజిందర్‌నగర్‌.

మరిన్ని వార్తలు