కుదురుకోని కూటమి..

27 Nov, 2018 05:56 IST|Sakshi

రెబెల్స్‌ ఉపసంహరించినా మిత్రులకు సహకరించని వైనం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పోలింగ్‌ జరిగేం దుకు మరో పదిరోజులే ఉన్న నేపథ్యంలో.. ప్రజా ఫ్రంట్‌ ఇంకా ప్రచారం ఊపందుకోకపోవటంతో కూటమికున్న పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. సీట్ల సర్దుబాటు, ఉపసంహరణల కోసం బుజ్జగింపులతో కూటమి ఇప్పటికే సగం కాలాన్ని చేజేతులా నాశనం చేసుకుంటే మరోవైపు అదే సమయాన్ని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చాకచక్యంగా వినియోగించుకుంటోంది. టీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ అన్నీ తానై ప్రచారా న్ని ముందుండి ఉరకలెత్తిస్తుంటే, కూటమి మాత్రం ఇంకా కిందిస్థాయిలోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతోంది.

జిల్లాస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే కూటమి ఇంకా ఆ స్థాయిలో క్యాంపెయిన్‌ను చేపట్టలేకపోతోం ది. కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు కనీసం విడివిడిగా కూడా క్షేత్రస్థాయికి పూర్తిస్థాయిలో చేరుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టి మూడురోజులైనా, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మిత్రపక్షాలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.

రెబెల్స్‌ కరుణించినా..
మరోవైపు పలుచోట్ల మిత్రపక్షాల స్థానాల్లో రెబెల్స్‌గా నామినేషన్లు వేసిన కాంగ్రెస్‌ నాయకులను అధిష్టానం దూతలు ఉపసంహరింపజేసినా వారింకా కూట మి భాగస్వామ్యపక్షాలకు సహకరిస్తున్న దాఖలాల్లే వు. సీట్ల సర్దుబాటులో భాగంగా తమకు కనీసం 5 స్థానాలైనా కేటాయించాలని పట్టుబట్టిన సీపీఐకు మూడేసీట్లను కేటాయించారు. సీపీఐ పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిపై హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా ప్రవీణ్‌రెడ్డి నామినేషన్‌ వెనక్కు తీసుకున్నా ఒక్కసారి కూడా సీపీఐ పక్షాన కలిసి ఆయన ప్రచారం చేయలేదు. ప్రవీణ్‌ను చాడతో సహా సీపీఐ నేతలు పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఇప్పటికీ ఆయన కూటమి పక్షాన బహిరంగప్రచారం నిర్వహించలేదు. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో చాడ ప్రస్తావించగా, కలిసి ప్రచారం చేసేలా ప్రవీ ణ్‌ ను ఒప్పిస్తామని ఆయన హామీనిచ్చారు. టీడీపీ, టీజేఎస్‌ పోటీచేస్తున్న కొన్ని స్థానాల్లో కూడా టికెట్‌ ఆశిం చి భంగపడ్డ వారితో పాటు, కాంగ్రెస్‌ నేతలు పూర్తిస్థాయిలో సహకరించట్లేదనే తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు