స్నేహితురాలి కోసం... అమెరికా నుండి జల్లీకి..

11 Apr, 2019 18:16 IST|Sakshi

 ఓటు హక్కు వినియోగించుకున్న చేతన

సాక్షి, చెన్నారావు పేట: చిన్నానాటి స్నేహితురాలికి కోసం అమెరికా నుండి జల్లీ గ్రామానికి చేరుకుని ఓ స్నేహితురాలు ఓటు హక్కును వినియోగించుకుంది. వివరాల్లోకి వెళితే జల్లీ గ్రామానికి చెందిన తొగరు చేతన అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుంది. కాగా చేతన ఖాజీపేటలోని ఫాతిమ హైస్కూల్‌లో మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితతో కలిసి  పదవ తరగతి వరకు(1996) చదువుకుంది. తాను  టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పడంతో తన స్వగ్రామమైన జల్లీ గ్రామంలో ఓటు వేయడానికి బుధవారం వచ్చింది. గురువారం జరిగిన లోకసభ ఎన్నికల్లో స్నేహితురాలు కవితకు తన తల్లి తొగరు విజయతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేసినట్లు తెలిపింది. తన స్నేహితురాలి గెలుపు కోసం తన ఓటు ఉపయోగ పడటం సంతోషంగా ఉందని తెలిపారు.

ఖండాంతరాలు దాటివచ్చి ఓటేసిన వెంకటేష్‌...
పల్లెటూరులో జన్మించాడు, ఉన్నత విద్యను అభ్యసించాడు. ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లి విద్యాభ్యాసం అనంతరం కాలిపోర్నియాలో ఉద్యోగంలో స్ధిరపడ్డాడు. 10 ఏళ్లుగా అక్కడే ఉన్నాడు. పార్లమెంట్‌ ఎన్నికలలో భాగంగా ఈనెల 10న స్వగ్రామం దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి వచ్చాడు. మొదటిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు వేసిన అనంతరం తన సంతోషం వ్యక్తం చేశాడు. ఎంత దూరంలో ఉన్నా పుట్టిన ఊరిలో ఓటు వేయడం చాలా ఆనందంగా ఉందని వెంకటేష్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు