రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం

7 Feb, 2018 12:19 IST|Sakshi
కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగిస్తున్న జక్కంపూడి రాజా, చిత్రంలో కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు

వైఎస్సార్‌ సీపీ యువజన నేత జక్కంపూడి రాజా

వైఎస్సార్‌ సీపీలో చేరిన 150 మంది ఎన్టీఆర్‌ నగర్‌ వాసులు

పెద్దాపురం: ప్రజా సంక్షేమ పాలన సాగించిన దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలన ఆయన తనయుడు పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పట్టణ ఎన్టీఆర్‌ నగర్‌ వాసులు సుమారు 150 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుబ్బారావు నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో రాజా మాట్లాడుతూ హైటెక్‌ పాలన పేరుతో ప్రజలను మభ్య పెడుతున్న చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కోఆర్డినేటర్‌ సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం పెద్దాపురం నియోజవర్గంలో మట్టి మాఫియా, అవినీతి పాలన రాజ్యమేలుతుందన్నారు. నాడు తోట గోపాలకృష్ణ హయాంలో రాజీవ్‌ గృహకల్ప నిర్మిస్తే సిగ్గు లేకుండా ఇప్పుడు ఎన్టీఆర్‌ పేరు పెట్టుకుని గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.

రాష్ట్ర నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, జిగిని వీరభద్రరావు, ఆవాల లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు రమేష్‌రెడ్డి, పెదిరెడ్ల రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ రానున్న  సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. అనంతరం ఆ వార్డు నాయకులు ధరణికోట యోహాను, తుమ్మల వాసుల ఆ«ధ్వర్యంలో కాలనీకి చెందిన కడియాల సత్తిబాబు, దూలం పెద్ద, సిమ్మ అప్పారావు, గుమ్మడి వీర్రాజు, అక్షింతల గంగాధర్, కడియాల కుమారి, సుందరపల్లి వీర వరలక్ష్మి, యర్రా శ్రీను, మంతా గోవిందు, షేక్‌ పయ్యాన్, బత్తుల తాతారావులతోపాటు సుమారు 100 మంది పురుషులు , 50 మంది మహిళలు పార్టీలో చేరగా వారికి జక్కంపూడి రాజా, సుబ్బారావు నాయుడులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేకా శ్రీను, విడదాసరి రాజా, గోపు మురళి, గుర్రాల యాకోబు, పేర్నేడి ఈశ్వరరావు, జిగిని రాజుబాబు, ఉద్దగిరి సతీష్, శెట్టిబత్తుల దుర్గారావు, కొల్లి రాజు, సేపేని సురేష్, కందుల వెంకటాచలం, గుణ్ణం రామ్మోహన్, పల్లా శ్రీనివాస్‌ యాదవ్, దేవాడ శ్రీనివాసరెడ్డి, నందిక లోవరాజు, నీలం రామకృష్ణ, అధిక సంఖ్యలో ఎన్టీఆర్‌ కాలనీవాసులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు