రేపు కాంగ్రెస్‌ ఒక రోజు దీక్ష

4 May, 2020 04:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఒక రోజు దీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పీసీసీ, డీసీసీ కార్యాలయాలు, స్థానిక సేకరణ కేంద్రాలు, పార్టీ నేతల ఇళ్లలో ఈ దీక్షలు చేపట్టాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి ఎం. శశిధర్‌రెడ్డి సమన్వయ కర్తగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు