సీట్ల కోసం పొత్తు పెట్టుకోవడం లేదు

12 Oct, 2018 01:54 IST|Sakshi

టీజేఎస్‌ అధినేత కోదండరాం

కాంగ్రెస్‌కు అల్టిమేటం అవాస్తవం

బీజేపీతో వెళ్లే ఆలోచన ఇప్పటివరకు లేదు..

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు తెలంగాణ జనసమితి అల్టిమేటం ఇచ్చిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశా రు. సీట్ల కోసం తాము పొత్తు పెట్టుకోవడం లేదని వెల్లడించారు. ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు, ఆ కార్యాచరణ అమలు, జనసమితికి గౌరవప్రద స్థానం కోసం మహాకూటమితో చర్చలు జరుగుతున్నాయని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాల కోసమే తమ పోరాటమని, దాని కోసం మేం తొందరపడుతున్నది వాస్తవమేనన్నారు.

ఒకట్రెండు రోజుల్లో ఒక నిర్ణయం వస్తుందని తమకు సమాచా రం ఉందన్నారు. తెలంగాణ ప్రజాప్రయోజనాల దృష్ట్యా మహాకూటమి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలని, అప్పుడే అందరం కలసి ఒక బలమైన ఎజెండా ను ముందుకు తీసుకెళ్లగలమన్నారు. దురదృష్టవశాత్తు చర్చలు ముందుకు సాగట్లేదని, ఇంకా కలిస్తే బాగుంటుంది అనే దశలోనే ఉందని వివరించారు. టీజేఎస్‌కు 3 నుంచి 5 సీట్లు అన్నది ప్రచారం మాత్రమే అని కోదండరాం పేర్కొన్నారు. తన పోటీపై పార్టీయే నిర్ణయిస్తుందన్నారు.

బీజేపీతో వెళ్లే ఆలోచన ఇప్పటివరకు లేదని, కూటమిలో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆలోచిస్తామన్నారు. కార్యకర్తలు, ప్రజలు ప్రశ్నిస్తుంటే తామేం సమాధానం చెప్పాలని.. అం దుకే తొందరపడుతున్నామన్నారు. ఏ రోజూ సీట్ల గురించి బహిరంగంగా మాట్లాడలేదన్నారు. ఈ విష యంలో తమకు స్పష్టత ఉందని, ఇన్ని సీట్లు ఇవ్వాలి అని తాము అధికారికంగా చెప్పలేదని తెలిపారు.  

టీజేఎస్‌లో చేరిన న్యాయవాది ప్రహ్లాద్‌..
గతంలో కోదండరాంతో విభేదించి జేఏసీ నుంచి బయటకి వెళ్లిన న్యాయవాది ప్రహ్లాద్‌ గురువారం కోదందరాం సమక్షంలో టీజేఎస్‌లో చేరారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పదవి ఇస్తామని ఆశ పెట్టడంతోనే కోదండరాంపై తాను విమర్శలు చేసినట్లు ప్రహ్లాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు