నేటి నుంచే మలిదశ పోరు

5 Mar, 2018 02:49 IST|Sakshi

బ్యాంకు కుంభకోణాలపై నిలదీస్తాం: ప్రతిపక్షాలు

‘ఫ్యూజిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్స్‌ బిల్లు’ ప్రవేశపెడతాం: కేంద్రం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ మలిదశ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు నెల రోజుల విరామం అనంతరం జరగబోతున్న ఈ సమావేశాల్లో.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం సహా ఇతర బ్యాంకు కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా కొనసాగడం ఖాయంగా కన్పిస్తోంది. బ్యాంకు కుంభకోణాలపై 267 నిబంధన కింద చర్చించాలని ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ నోటీసు ఇచ్చారు.

బ్యాంకు కుంభకోణాలపై ప్రధాని సమాధానం కోసం పట్టుబడతామని ఆయన తెలిపారు. ఆర్థిక నేరగాళ్లకు చెక్‌ పెట్టేందుకు ‘ఫ్యూజిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్స్‌ బిల్లు’ను తీసుకొస్తున్నామని పేర్కొంటూ ప్రతిపక్షాల ప్రశ్నలకు దీటుగా బదులిచ్చేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలు సంక్రమిస్తాయి. ఈ బిల్లుకు గురువారమే కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  

ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాల్ని ప్రతిపక్షాలు ఇంతవరకూ ఖరారు చేయకపోయినా.. ఒకట్రెండు రోజుల్లో సమావేశం కావచ్చని తెలుస్తోంది. బ్యాంకు కుంభకోణాలతో పాటు దళితులు, మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, రైతుల సమస్యలు, దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం తదితర అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ అరెస్టు నేపథ్యంలో.. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపును పార్లమెంటులో నిలదీస్తామని ఆనంద్‌ శర్మ తెలిపారు. సమావేశాలపై సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ.. పీఎన్‌బీ కుంభకోణం ఎలా చోటుచేసుకుందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తామన్నారు. ఇతర ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వ తీరును ఉభయ సభల్లో ఎండగడతామని తృణమూల్‌ నేత డెరెక్‌ ఒబ్రియెన్‌ తెలిపారు.  

పలు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
బడ్జెట్‌ సమావేశాల మలిదశలో సాధారణంగా వివిధ శాఖలకు అవసరమైన నిధుల కేటాయింపుపై చర్చలు కొనసాగుతాయి. అలాగే ఆమోదం కోసం ఉభయ సభల్లో ప్రభుత్వం కొన్ని బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో గ్రాట్యుటీ చెల్లింపు(సవరణ)బిల్లు 2017, ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు, డెంటిస్ట్స్‌ (సవరణ) బిల్లును మంగళవారం ప్రవేశపెడతారు. మోటారు వాహనాల(సవరణ) బిల్లు 2017, ద స్టేట్‌ బ్యాంక్స్‌(రద్దు, సవరణ) బిల్లు 2017ను సమావేశాల మొదటి రోజున రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లోనే ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదం పొందేందుకు ప్రతిపక్షాలతో సంప్రదింపుల్ని కేంద్రం ముమ్మరం చేయనుంది.

 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సభను అడ్డుకుంటే ఊరుకోం: అంబటి

‘అందుకే కలెక్టర్లకు విశేషాధికారాలు’

ఎన్ఎండీసీ నుంచే విశాఖ స్టీల్‌కు ముడి ఖనిజం

అక్బరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

మహనీయులు కోరిన సమసమాజం జగన్‌తోనే సాధ్యం

కర్ణాటకం: పతనం వెనుక కాంగ్రెస్‌!

వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు

కేసీఆర్‌ గారూ! మీరు తెలంగాణాకు ముఖ్యమంత్రి..

భ్రమరావతిలోనూ స్థానికులకు ఉపాధి కల్పించలేదు

స్థానికులకు 75శాతం జాబ్స్.. ఇది చరిత్రాత్మక బిల్లు

పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌

ట్రంప్‌తో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు!

ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు

సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు

సభను నవ్వుల్లో ముంచెత్తిన మంత్రి జయరాం

‘మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు’

‘తాళపత్రాలు విడుదల చేసినా.. మిమ్మల్ని నమ్మరు’

‘ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొననివారు అనర్హులే’

‘ఎందుకు బహిష్కరించారో అర్థం కావట్లేదు’

అక్టోబర్‌ నుంచే రైతులకు పెట్టుబడి సాయం

కాల్‌మనీ కేసుల్లో రూ.700 కోట్ల వ్యాపారం

ప్రతిరోజూ రాద్ధాంతమేనా!!

బోయపాటికి షూటింగ్‌ చేయమని చెప్పింది ఎవరు?

‘ప్రతిదీ కొనలేం.. ఆ రోజు వస్తుంది’

అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ సభ్యులు అత్యుత్సాహం

కూలిన కుమార సర్కార్‌ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

మరో పది రోజులు పార్లమెంట్‌!

అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం 

అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారు

బడుగులకు మేలు చేస్తే సహించరా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!

సెల్యూట్‌ ఆఫీసర్‌

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి