‘మమత, చంద్రబాబు ఐసీయూలో చేరారు’

20 May, 2019 16:23 IST|Sakshi

ఫలితాలను చూసి విపక్షాలు ఐసీయూలో చేరాయి

ఎగ్జిట్‌ పోల్స్‌పై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ:  నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ స్పందిస్తూ.. ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూసిన తరువాత విపక్ష పార్టీల నేతలు షాక్‌కి గురైయ్యారు. ముఖ్యంగా బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫలితాలను చూసి తట్టుకోలేక ఐసీయూలో చేరారు. మే 23న వెలువడే ఫలితాలు మరింత స్పష్టంగా ఉంటాయి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం’’  అని వ్యాఖ్యానించారు.

కాగా ఆదివారం దేశ వ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌లో  ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. పలు సర్వేల నివేదిక ప్రకారం 280 సీట్లకు పైగా స్థానాలను సాధించి మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశాయి. కాగా ఎగ్జిట్‌ పోల్స్‌ను విపక్షాలు నేతలు కొందరు కొట్టిపారేసిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు