వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు 

18 Jan, 2020 13:14 IST|Sakshi
వెంకటరాజపురం నుంచి పార్టీలో చేరిన వారికి కండువాలు వేస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, పరీక్షిత్‌రాజు

ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, పరీక్షిత్‌రాజు   

వైఎస్సార్‌సీపీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. ప్రతి గ్రామం నుంచి నాయకులు... స్థానికులు ఇతర పార్టీల మద్దతుదారులు విరివిగా వచ్చి చేరుతున్నారు. కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో శుక్రవారం చేరారు. స్థానిక ఎన్నికల  ముందు ఈ చేరికలు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. 

జియ్మమ్మవలస: వైఎస్సార్‌ సీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖమంత్రి పాముల పుష్ఫశ్రీవాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు అన్నారు. మండలంలోని గవరమ్మపేట, వెంకటరాజపురం, జియ్యమ్మవలస, పొట్టుదొరవలస గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి చినమేరంగిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.  గవరమ్మపేట నుంచి 95 కుటుంబాలు, వెంకటరాజపురం నుంచి 40 కుటుంబాలు, జియ్యమ్మవలస పంచాయతీ పొట్టుదొరవలస నుంచి 20 కుటుంబాలు, జియ్యమ్మవలస నుంచి 60 కుటుంబాలవారు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు.

అమ్మ ఒడి, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ తదితర మంచి పథకాలతో పేదలను ఆదుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్‌లో టీడీపీ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగనన్న చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని, ఇందులో భాగంగానే టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారన్నారు. పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరూ స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని కోరారు.

పార్టీలో చేరిన వారిలో వెంకటరాజపురం గ్రామానికి చెందిన మర్రాపు లక్ష్మునాయుడు, కర్రి సీతం నాయుడు, బొత్స గోవిందరావు, శ్రీరామాయూత్‌ సభ్యులు, గవరమ్మపేట గ్రామం నుంచి డీలర్‌ రౌతు అప్పలనాయుడు, కె.చంద్రశేఖర్, గవరమ్మపేట యువత ఉన్నారు. అలాగే,  జియ్యమ్మవలస, పొట్టుదొరవలస నుంచి దత్తి శంకరరావు, బేత అప్పలనాయుడు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, తటిపిడకల వెంకటనాయుడు, రాయల సింహాచలం, గర్భాన చిన్న, చిలకల తిరుపతి, రంభ సత్యనారాయణ, రంభ శ్రీరాములు తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ మూడడ్ల గౌరీశంకరరావు, మండల ఎన్నికల సమన్వయకర్త బొంగు సురేష్‌, ఆర్నిపల్లి వెంకటనాయుడు, పెద్దింటి శంకరరావు, మర్రాపు చినతాతబాబు, జోగి సురేష్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు