అందుకే కరీంనగర్‌లో ఓడిపోయాం: కేటీఆర్‌

8 Aug, 2019 11:28 IST|Sakshi

     అందుకే కరీంనగర్‌లో ఓడిపోయాం 

     టీఆర్‌ఎస్‌ కోసం రోజూ గంట పనిచేయండి 

స్థలం ఉన్నోళ్లకు ఇంటి నిర్మాణానికి సాయం 

మధ్యమానేరు నిర్వాసితులతో అనవసర రాజకీయం 

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

సాక్షి, సిరిసిల్ల:  టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు అతివిశ్వాసం పనికి రాదని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం పార్టీ బూత్‌ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఎంతో బలంగా ఉందనే అతినమ్మకంతోనే లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌లో ఓడిపోయామని, ఫలితంగా మంచి నాయకుడిని కోల్పోయామని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేవలం అతివిశ్వాసంతో అలసత్వాన్ని ప్రదర్శించామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీలో సగం వచ్చినా ఎంపీ సీటు గెలిచేవాళ్లమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు రోజూ గంటసేపు పార్టీ కోసం పనిచేస్తే చాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు వచి్చనా క్షేత్ర స్థాయిలో గులాబీ సైనికులు సిద్ధంగా ఉండాలని కోరారు.  

ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి 
70 ఏళ్లలో చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. సర్కారు ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచేందుకు కేసీఆర్‌ కిట్లను అమలు చేసిందని, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో బాల్యవివాహాలను తగ్గించిందన్నారు. రాష్ట్రం ఏటా రూ.12 వేల కోట్ల పింఛన్లు ఇస్తుంటే.. కేంద్రం ద్వారా కేవలం రూ.200 కోట్లు వస్తున్నాయని ఆయన వివరించారు. ఉప్పేసి పొత్తు కూడినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. ‘రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు పంచాలి’లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

సొంతస్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకోడానికి ప్రభుత్వం సాయం అందిస్తుందని కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఇంటికి వెళ్లినా.. ఏదో ఒక రూపంలో ప్రభుత్వ లబ్ధిని పొందిన వారే ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు చెప్పాలని, ఇంకా ఏం కావాలో తెలుసుకోవాలని సూచించారు. మధ్యమానేరు నిర్వాసితులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మెరుగైన పరిహారం ఇచ్చి రూ.350 కోట్లు అదనంగా నిర్వాసితులకు అందించామన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని కేటీఆర్‌ పేర్కొన్నారు. సిరిసిల్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి నేత కారి్మకులే ప్రచార కర్తలని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల నేతన్న చౌక్‌లోని విగ్రహానికి ఆయన పూలమాల వేశారు.  

గోదావరి జీవనది అయింది 
కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నది 150 కిలోమీటర్ల మేరకు నిండా నీటితో జీవనదిగా మారిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. నీరుంటే.. బీడు భూములు సస్యశ్యామలం కావడంతోపాటు మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఒకే పంటను రైతులందరూ వేయకుండా సీఎం సూచించిన విధంగా పంట కాలనీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించాలని కోరారు. హరితహారాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టాలన్నారు. అన్ని గ్రామాల్లోనూ డంపింగ్‌ యార్డులను, వైకుంఠ ధామాలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పైసలిస్తే.. ఎవరైనా వస్తారు!?

సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ?

లోక్‌సభలో మన వాణి

ఎంపీ సుమలత ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్‌

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వాయిదా

నిన్న కశ్మీర్‌.. రేపు మన రాష్ట్రాలకు

యడ్డికి షాక్‌!

సుష్మా స్వరాజ్‌ రోజుకో రంగు చీర

ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్‌

చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయింది

కోడెల పంచాయతీ.. ‘డోంట్‌ వర్రీ’ అన్న బాబు!

సెల్యూట్‌తో కడసారి వీడ్కోలు పలికారు!!

గంజాయ్‌ తాగేవాడు.. గాగ్రా, చోలీ వేసేవాడు!

గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

అలా 25 ఏళ్లకే ఆమెకు అదృష్టం కలిసొచ్చింది

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 

లదాఖ్‌ నుంచి మరో ఉద్యమం!

కేశినేని నానిపై విష్ణువర్ధన్‌రెడ్డి ఫైర్‌

నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ

‘విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించను’

మాట తప్పారు దీదీ; స్మృతి భావోద్వేగం!

సుష్మా ప్రస్థానం: కాశీ నుంచి కర్ణాటక వరకు

నన్నపనేని రాజకుమారి రాజీనామా

అదృష్టం బాగుండి ఆయన అధికారంలో లేరు గానీ..

తెలంగాణ చిన్నమ్మగా నిలిచిపోతారు

మోదీ-షా తదుపరి టార్గెట్‌ అదేనా?

‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’

‘మా అమ్మను హరి నివాస్‌లో బంధించారు’

ముగిసిన అంత్యక్రియలు

ఉప రాష్ట్రపతితో సీఎం జగన్‌ సమావేశం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..