మనోళ్లు భేష్!

19 Mar, 2019 11:34 IST|Sakshi

ఎంపీల్యాడ్స్‌ నిధుల ప్రతిపాదనల్లో మల్లన్న టాప్‌

425 పనులకు ప్రతిపాదనలు ఇచ్చిన మల్లారెడ్డి

288 అభివృద్ధి పనులకు అసదుద్దీన్‌ ప్రతిపాదనలు

231 పనులను ప్రతిపాదించిన బండారు దత్తాత్రేయ  

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ అభ్యర్థులకు ఏటా కేంద్రంకేటాయించే ఎంపీ ల్యాడ్స్‌ (మెంబర్స్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ స్కీమ్స్‌) అభివృద్ధి నిధుల వినియోగానికి సంబంధించి మల్కాజిగిరి మాజీ ఎంపీ, ప్రస్తుత రాష్ట్రకార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అగ్రస్థానంలోనిలిచారు. ఆయన ఐదేళ్ల పదవీ కాలంలో తన లోక్‌సభనియోజకవర్గ పరిధిలో 425 అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్‌కు సిఫారస్‌లు పంపారు. ఆ తర్వాత ద్వితీయ స్థానంలో హైదరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నిలిచారు. ఆయన 288అభివృద్ధి పనులకు సిఫారస్‌ చేశారు. ఎంపీల్యాడ్స్‌ నిధులకు సంబంధించిన సిఫారస్‌ల విషయంలో మూడోస్థానంలో నిలిచిన సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ 231 పనులనుప్రతిపాదించారు. వీరు ఎంపీలుగా గెలిచిన తొలి మూడేళ్లలోప్రతిపాదించిన పనులకు నిధులు దక్కడంతో ఆయా పనులు పట్టాలెక్కాయి. కానీ గత రెండేళ్లుగా నిధుల లేమితో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండడం గమనార్హం. మహానగరపరిధిలో మన ఎంపీ సాబ్‌ల నిధుల వినియోగం ఇలా ఉంది.   

సికింద్రాబాద్‌లో దత్తాత్రేయసిఫారస్‌లు.. అభివృద్ధి పనులు
ఐదేళ్లలో సికింద్రాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ బండారు దత్తాత్రేయకు మొత్తంగా రూ.16.67 కోట్లు నిధులు దక్కాయి.  
ఆయన ఐదేళ్లుగా రూ.34.79 కోట్ల విలువైన 231 పనులు ప్రతిపాదించారు
ఇందులో రూ.23.99 కోట్లతో 193 పనులు చేపట్టారు
2014–15లో రూ.5.14 కోట్ల వ్యయంతో 29 పనులు చేపట్టేందుకు హైదరాబాద్‌ కలెక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఈ పనులన్నింటినీ చేపట్టారు
2015–16లో రూ.5.17 కోట్లతో 53 పనులు చేపట్టేందుకు ప్రతిపాదించగా.. ఇందులో అన్నింటినీ ప్రారంభించారు
2017–18లో రూ.5 కోట్లు నిధులు విడుదల కావాల్సి ఉన్నా ఇప్పటి వరకు నిధులు రాలేదు

మల్కాజిగిరిలో మల్లారెడ్డి ప్రతిపాదనలివీ..
గత ఐదేళ్లుగా రూ.27.78 కోట్ల అంచనా వ్యయంతో 425 పనులను ప్రతిపాదించారు. ఇందులో 269 పూర్తి కాగా.. మరో 76 పురోగతిలో ఉన్నాయి. ఇంకా 26 పనులు ప్రారంభం కావాల్సి ఉంది
2014–15లో రూ.4.85 కోట్లతో 126 పనులు సిఫారస్‌ చేయగా.. ఇందులో రూ.3.51 కోట్లతో చేపట్టిన 104 పనులు పూర్తయ్యాయి. మరో 14 పురోగతిలో ఉన్నాయి ూ 2015–16లో మొత్తం రూ.8.56 కోట్లతో 145 పనులు ప్రతిపాదించారు. ఇందులో రూ.6.65 కోట్లతో చేపట్టిన 99 పనులు పూర్తయ్యాయి. మరో 21 పురోగతిలో ఉన్నాయి. ఆరు ప్రారంభం కాలేదు ూ 2016–17లో 62 పనులు ప్రతిపాదించారు. వీటిలో 34 మాత్రమే పురోగతిలో ఉన్నాయి. మిగతావి ప్రారంభం కాలేదు 2017–18లో 58 పనులకు సిఫారసు చేయగా ఇందులో 31 పనులు పూర్తయ్యాయి. 16 పురోగతిలో ఉన్నాయి. మూడు ప్రారంభం కాలేదు. 2018–19లో 34 పనులకు సిఫారసు చేయగా.. 19కి మాత్రమే అనుమతి లభించింది. ఒక్క పని మాత్రమే పూర్తయ్యింది. 13 పురోగతిలో ఉన్నాయి. మరో ఐదింటికి మోక్షం కలగలేదు

హైదరాబాద్‌లో అసద్‌ప్రతిపాదించిన పనులివే..
గత ఐదేళ్లుగా అసదుద్దీన్‌ ఒవైసీ రూ.29.17 కోట్లతో 288 పనులను ప్రతిపాదించారు
 2014–15లో 40 పనులు ప్రతిపాదించగా.. రూ. 4.57 కోట్లతో 38 పనులు మొదలుపెట్టారు
2015–16లో రూ.5.08 కోట్లతో 48 పనులకు సిఫారస్‌ చేయగా.. వీటికి పాలనా పరమైన ఆమోదం లభించింది
2016–17లో రూ.6.96 కోట్ల అంచనాతో 72 పనులను ప్రతిపాదించారు. ఈ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి
2017–18లో రూ.7.23 కోట్ల అంచనా వ్యయంతో 72 పనులకు ప్రతిపాదనలిచ్చారు. వీటికి నిధుల లేమి శాపంగా పరిణమించింది. కేంద్రం నిధులు విడుదల చేయలేదు ూ 2018–19 ఆర్థిక సంవత్సరంలోనూ నిధులు విడుదల కాలేదు. దీంతో ప్రతిపాదించిన 56 పనుల్లో కొన్నింటికి మాత్రమే మోక్షం లభించింది.

మరిన్ని వార్తలు