‘శాసన మండలి రద్దు చేసింది టీడీపీనే’

28 Jan, 2020 16:35 IST|Sakshi

సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గతంలో శాసనమండలిని రద్దు చేసింది టీడీపీ ప్రభుత్వమే అని అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. ఆయన మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో శాసనమండలి ఏమాత్రం అవసరంలేదని చెప్పిన వారిలో ముఖ్యుడు చంద్రబాబు నాయడు అని ఆయన మండిపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న శాసన మండలి ఉండటం శుద్ధ దండగ అనే భావం ప్రజల్లో కలిగిందని రవీంద్రబాబు గుర్తు చేశారు.

శాసన మండలి ద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో రాజకీయ ప్రయోజనం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం శాసన మండలి రద్దు చేశారని అయన అన్నారు. శాసన మండలి రద్దు నిర్ణయం.. సీఎం జగన్‌ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ఏ ప్రయత్నంలో ఆయినా ప్రజలందరూ.. అయన వెంటే ఉన్నారని రవీంద్రబాబు గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు