కాంగ్రెస్‌కు మరో పీసీసీ రాజీనామా

28 May, 2019 08:59 IST|Sakshi

పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సునిల్‌ జక్కర్‌ రాజీనామా

చండీగఢ్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు పదవి నుంచి వైదొలగగా.. తాజాగా పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సునిల్‌ జక్కర్‌ పదవికి రాజీనామా చేశారు. గురుదాస్‌ పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీ డియోల్‌ చేతిలో ఆయన ఓ‍టమిచెందారు. అయితే 2017లో బీజేపీ ఎంపీ వినోద్‌ ఖన్నా మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప  ఎన్నిక జరగగా.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన సునిల్‌ జక్కర్‌ గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా వీచిన మోదీ గాలి.. గురుదాస్‌పూలోర్‌నూ ప్రభావం చూపించింది. దీంతో సన్నీ డియోల్‌ చేతిలో ఆయన ఓటమి చెందారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ..తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జక్కర్‌ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేఖ పంపారు. కాగా జక్కర్‌ రాజీనామాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఓటమి చెందినంత మాత్రనా పదవికి రాజీనామ చేయాల్సిన అవసరంలేదని అన్నారు. కాగా పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ ఎనిమిది స్థానాలను సొంతం చేసుకున్న విజయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు