ఉభయ సభల్లో గందరగోళం.. వాయిదా

12 Mar, 2018 11:25 IST|Sakshi
రాజ్యసభ.. లోక్‌ సభలో నినాదాలు చేస్తున్న సభ్యులు

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హోదా నినాదంతో పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. సోమవారం ఉదయం సభా సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే విపక్షాలు నినాదాలతో నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.

ముందుగా ప్రత్యేక హోదాపై స్పందించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కాలింగ్‌ అటెన్షన్‌ నోటీసు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే సభ్యులు ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నాం 2గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. 

ఇక లోక్‌సభలోనూ ఇదే తరహా సన్నివేశం చోటు చేసుకుంది. నినాదాలు చేస్తూ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లటంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తెలిపారు.

పార్లమెంట్‌ ఆవరణలో...
వైఎస్సార్‌కాంగ్రెస్‌ ఎంపీలు ప్రత్యేక హోదా డిమాండ్‌ తో తమ నిరసన గళం వినిపించారు. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ వద్ద ఈ ఉదయం నిరసన చేపట్టారు. విజయసాయి రెడ్డి నేతృత్వంలోని ఎంపీలు ఫ్లకార్డులతో నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు