-

దిశ కేసు.. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు

3 Dec, 2019 20:53 IST|Sakshi

సాక్షి, తిరుపతి: షాద్‌నగర్‌లో వెటర్నరీ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో యావత్తు సమాజం ఆగ్రహంతో రగిలిపోతుంటే.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. రేపిస్టులను బహిరంగంగా ఉరి తీయాలంటూ జనం చేస్తున్న డిమాండ్‌ సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. రేపిస్టులను బెత్తంతో రెండు దెబ్బలు చెమ్డాలు  ఊడేలా కొట్టాలంటూ పవన్‌ వ్యాఖ్యలు చేశారు.

‘వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్‌ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పవన్‌ పేర్కొన్నారు. ఆడవాళ్లపై నిత్యం సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత కిరాతకంగా, అమానుషంగా షాద్‌నగర్‌ శివార్లలో దిశను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబుక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు